శ్రీకృష్ణ - కాళీయమర్ధనం

శ్రీకృష్ణ - కాళీయమర్ధనం



క్రమంగా కలం మరి వేసవికాలం వచ్చింది. ఎండలు అందిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణుడు ఉన్న బృందావనంలో మాత్రం ఎప్పుడు వసంత ఋతువే ఉండేది. ఎప్పటిలాగానే ఆవుదూడలను మేపటానికి వేళాటానికి శ్రీకృష్ణుడు బలరాముడికి పిలిచారు. బలరాముడు శ్రీకృష్ణుడితో ఈరోజు ఎండా వేడిగా ఉంది నేను రాలేను మీరు వెళ్లిరండి అని చెప్పారు. అందుకు శ్రీకృష్ణుడు మనస్సులో నువ్వు ఎందుకు రాను అంటున్నావో నాకుతెలుసులే సరే నువ్వు ఈ రోజుకి ఇంట్లోనే ఉండు నేను వెళ్లివస్తాను అని  చేపి గోపాలబాలురతో శ్రీకృష్ణుడు అడవికి వెళ్లారు. అడవిలో ఆవుదూడలు అక్కడక్కడే గడ్డి మేస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వలన అందరూ చెట్టుకిందన సేదతీరుతున్నారు. కొంతసేపటికి గోపాలబాలురకి దాహం వేసింది. శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ మాకు చాలా దాహంగా ఉంది. మేము ఆ మడుగులో నీరు తాగుతాము అని చేపి వెళ్లారు. ఇంతలో శ్రీకృష్ణుడు వద్దు వెళ్ళాడు అని అనేలోపే వాళ్ళు ఆ నీళ్లు తాగేశారు. కొంతసేపటికి వారందరు మరణించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయ్యో ఎంత పని చేసారు మీరు నేను వద్దు అనేలోపే వెళ్లి నీళ్లు తాగేశారు ఇప్పుడు చుడండి ఏమయిందో అని వాలందరిని చూపులతో బ్రతికించారు. ఈ మడుగులో ఉన్న కాళియుడికి కాలం ఆసన్నమైనది. వీడు వదిలిన విషం వలన మడుగు అంత విషపూరితమైనది. ఆ విషపునీరు ఎండకి ఆవిరిలామారి గాలిలో కలసి ఈ మడుగుపై వచ్చిన పక్షులు కూడా చనిపోతున్నాయి. వీడికి గుణపాఠం చెప్పాలి. శ్రీకృష్ణుడు చుట్టూ చూసాడు. ఆయనకి ఒక కదంబ వృక్షం కనిపించింది. గోపాలబాలురతో స్నేహితులారా! ఈ ఇక్కడ ఏమి జరిగిన మీరు ఏమి మాట్లాడవద్దు. మీరు మడుగులోకి రావద్దు అని చెప్పారు. శ్రీకృష్ణుడు మడుగులో దూకటానికి తన ఉత్తరీయాని నడుముకి గట్టిగా కట్టుకున్నారు. నెమలిపించని పడిపోకుండా గట్టిగా తలకు కట్టుకున్నారు. ఇపుడు కాళియుడికి నేను వచ్చిన విషయం తెలియాలి అంటే నేను మడుగులో పెద్ద శబ్దం చేయాలి. కదంబం వృక్షం పైకి ఎక్కారు. అక్కడినుంచి అమాంతం మడుగులోకి దూకారు. శ్రీకృష్ణుడు దూకిన వేగానికి మడుగులో నీళ్లు పనేందు మైళ్ళు ఎత్తుకి కెరటాలు లేచాయి. ఆ శబ్దానికి కాళియుడు ఉలిక్కిపడ్డాడు. ఎవరు నా మడుగులోకి వచ్చే ధర్యం చేసింది అని వచ్చి చూసాడు. చుస్తే ఆరు సంవత్సరాల పిల్లవాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు అని వదిలేస్తే అందరూ నన్ను పిరికివాడు అంటారు. శ్రీకృష్ణుడుని చంపటానికాని అయన మీదకి వచ్చారు. శ్రీకృష్ణుడిని ఏడూ చుట్టాలు చుట్టి పడగా విపి శ్రీకృష్ణుడిని గట్టిగా  నొక్కసాగాడు. శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. బృందావనం వాసులను తన తల్లీతండ్రులని పరీక్షించాలి అనుకున్నారు. వీరంతా నామీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. వీరి ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూడాలి అని శ్రీకృష్ణుడు కాళియుడి చెరలో ఉంది తలను పక్కకు వాల్చేసారు. అది చూసి గోపాలబాలురి గుండె ఆగిపోయింది. శ్రీకృష్ణ అంటూ కుందపడిపోయారు. అదేసమయంలో బృందావనంలో అందరికి ఆడవారికి కుడికన్నుమొగవారికి ఎడమ కన్ను అదిరింది. అందరూ ఒకచోటికి వచ్చి శ్రీకృష్ణుడికి ఎదో ఆపద వచ్చింది. మా మనస్సులు గంగారుగా ఉన్నాయి అని వారు ఎక్కడిపనులు అక్కడే వదిలిపెట్టి ఉన్నపలంగా అందరూ అడవి వైపు వచ్చారు. అక్కడ మడుగులో కాళియుడి చెరలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ విలవిలా ఏడిచారు. ఆ కాళియుడిని శాపనార్ధాలు పెట్టారు. యశోదమ్మ, నందుడు మేము కూడా మా పుత్రుడితోపాటే చనిపోతాము అని మడుగులోకి వెలబోతున వారిని బృందావణవాసులు అప్పుతున్నారు. అప్పుడు బలరాముడు మనస్సులో స్వామి నీ లీలావినోదం ఎంతసేపు నీపై ప్రేమతో అందరి ప్రాణాలు మొయేలాగా ఉన్నాయి. వారికీ కరుణించు అని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు చిరు మందహాసం చేసి ఉన్నటుండి తన శరీరాన్ని అమాంతం పెంచేశారు. కాళియుడి శరీరం అంత గాయాలు అయ్యాయి శ్రీకృష్ణుడిని వదిలేసాడు. కాళియుడికి కోపంవచ్చి మళ్ళి  శ్రీకృష్ణుడి మీదకి రాబోయారు. శ్రీకృష్ణుడు కాళియుడి తోకను పట్టుకొని గిరగిరా తిపి ఒక కొండకు వేసికొంటారు. శరీరం అంత రక్తం వస్తున్నా కాళియుడి అహంకారం చవక మళ్ళి మళ్ళి శ్రీకృష్ణుడి మీదకు వచ్చాడు. శ్రీకృష్ణుడు వచ్చిన ప్రతిసారి గిరగిరా తిపి కొట్టారు. ఎలా వంద సార్లు తిపి కొట్టారు. కాళియుడికి నూటైదు పడగలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు వాటిపైకి ఎక్కి నుంచున్నాడు. ఒకోపడగకి ఒకో మణి ఉన్నది. అయన ఈ పడగలపైనా నాట్యం చేయటానికి వేదికలుగా తయారయింది. అన్ని దెబ్బలు తిన్న కాళియుడు కదలలేక ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు మధురమైన మురళిని వాయిస్తూ నాట్యం మొదలు పెట్టారు. శ్రీకృష్ణుడి నాట్యానికి ప్రకృతి పరవశించింది. తుమ్మెదలు శ్రీకృష్ణుడి వేణువుకి అనువుగా జుంకానాథం చేసాయి. యమునా నది తన కెరటాలను పైకి ఎత్తి దాచుతుంటే మృదంగా ధ్వనిలాగా వినిపించాయి. ప్రకృతిలో ఉన్న చిలుకలు, కోయిలలు మధురంగా తమ కుతలను వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నపుడు అయన కాళ్ళకి ఉన్న గజ్జలు తాళంలా చేస్తున్నాయి. అయన నాట్యం చేస్తుంటే అక్కడి చెట్లు చల్లని వసంత గాలులు వీచాయి. కాళియుడి తలల పైన ఉన్న మణులు ఒకోటి ఒకో రంగులో ఉన్నాయి. నవరత్నాలు రంగులు శ్రీకృష్ణుడు ముఖం పై పడి అయన ఇంకా అందంగా కనిపించరు. ఈ సుందరమైన సంఘటనకు దేవతలు కూడా పరవశించి శ్రీకృష్ణుడి పై పుష్ప వర్షం కురిపించారు. శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుంటే అయన పాదముద్రలు కాళియుడి తలలపై పడ్డాయి. తరువాత కాళియుడికి బుద్దు వచ్చింది. నా విషజ్వాలకు దేవతలు సైతం భయపడతారు. నారదుడు ఒకసారి నన్ను హెచ్చరించారు నువ్వు ఇలాగే అహంకారంతో ఉంటె వైకుంఠ వాసుడైన శ్రీకృష్ణుడు నీకు బుద్ధి చెపుతారు అన్నారు. ఈయన ఎవరోకాదు ఆ దేవాధిదేవుడు శ్రీమహావిశువే అని శ్రీకృష్ణుడిని శరణు వేడాడు. శ్రీకృష్ణ శరణు శరణు అని వేడుకున్నారు. కాళియుడికి నూటొక్క మంది భార్యలు. వారందరు స్త్రీ రూపము దాల్చి శ్రీకృష్ణుడిని శరణు వేడారు. శ్రీకృష్ణ శరణు శరణు అని వేడుకున్నారు. స్వామి మా పతిని విడిచిపెట్టు అతని తప్పులను మనించు. దేవదేవుడివైనా నీవు మన్నించకపోతే మమ్మలిని ఇంకా ఎవరు రక్షిస్తారు. మా తండ్రులు ఈ కాళియునికి ఇచ్చి వివాహం చేసారు. ఆదివివాహమే కాదు. నివ్వు మా పతిని విడిచిపెడితే అదేమాకు మరల వివాహం జరిగినట్టు అనుకుంటాము. మాకు పతి బిక్ష పెట్టు అని వేడుకున్నారు. కాళియుడు కూడా స్వామి! నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అమాయకులను భాదించాను అని వేడుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కాళియా! ఇది ప్రజలకు ఉపయోగపడే మడుగు దీనిని విడిచి నీ నిజస్థానమైన రమణక ద్విపానికి వెళ్ళు అని అన్నారు. అప్పుడు కాళియుడు స్వామి! నేను అహంకారంతో గరుత్మంతునితో విరోధం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మడుగు నుండి నేను వెళితే గరుత్మంతుడు నన్ను సంహరిస్తాడు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కాళియా! నేను నీ శిరస్సు పైన నాట్యం చేయటం వలన నా పాదముద్రలు నీ శిరస్సులపై పడాయి. వాటిని చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు. నీవు ధైరంగా వెళ్ళు అని చెప్పారు. కాళియుడు అతని భార్యలు అతని సంతానం అంత బృందావణ వాసులు అంతా చూస్తుండగానే మాయమయిపోయారు. అంత శ్రీకృష్ణుడి లీలా అనుకున్నారు. శ్రీకృష్ణుడు తన చూపులతో మడుగులో విషాన్ని తిలగించారు. శ్రీకృష్ణుడు వడ్డుకు వచ్చారు. యశోదమ్మ శ్రీకృష్ణుడికి పట్టుకొని తన కనీళ్లతో శ్రీకృష్ణుడి తలకి అభిషేకం చేసేసింది. తన పుత్రుడిని తలచుకొని తరచి తరచి చేసుకుంటేనే గాని ఆమె మనస్సు శాంతించలేదు. బృందావన వాసులంతా శ్రీకృష్ణుడు మళ్ళి నవ్వుతు కనిపించేసరికి శాంతించారు. 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...