శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించేవారు.

 శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించేవారు.



కొంతకాలానికి వేసవికాలం పోయింది వర్షాకాలం వచ్చింది వర్షాలు పడాయి. బృందావనంలో వ్యవసాయం చేసేవాళ్లు వ్యవసాయపనులు మొదలు పెట్టారు. అక్కడ నల్లని మేఘాలు కమ్ముకొని వర్షం పడుతుంటే నెమళ్ళు పురివిపి నాట్యం చేసేవి. నేమాలల్లో మగ నెమలి మాత్రమే నాట్యం చేసేవి. అవి పురివిపి నాట్యం చేస్తున్నపుడు ఆడనెమలి అక్కడికి వచ్చి మగనెమలి చుట్టు తిరుగుతూ మగ నెమలి కంటి నుండి నీరు కారుతుంది. ఆ నీటిని తాగి ఆడనెమలి గర్భం ధరించి గుడ్లు పెడుతుంది. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుల సంభోగం ద్వారా సంతానం పొందని అస్కలిత బ్రహ్మచారి కేవలం నెమళ్ళు మాత్రమే. శ్రీకృష్ణుడు అయన కూడా నేను అస్కలిత బ్రహ్మచారిణి అని తెలియచేయటానికే తన తలపైన నెమలి పింఛాన్ని ధరిస్తారు. నేను ఇంతమంది గోపికలతో విహరిస్తున్న నేను అస్కలిత బ్రహ్మచారిని అని తెలియజేసేవారు. బృందావనంలో వర్షలు పడిన తరువాత గోపకులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. గోపాలకులు ఎక్కువగా గోధుమలు, సేమకం అనే ధాన్యాన్ని పండించేవారు. వర్షాకాలంలో శ్రీకృష్ణుడు గోవులను తీసుకొని దూరంగా వెళ్లకుండా నదుల పక్కన సెలయాల పక్కన మేపుతూ తిరుగుతుండేవారు. శ్రీకృష్ణుడు బృందావనం నుంచి గోవులను తీసుకొని బయటకు వెళ్ళగానే గోపికలు అంత ఒక చోటచేసి శ్రీకృష్ణుడు గోవులు గోవులు అంటూ వాటిని తీసుకొని వెళ్లిపోతారు మనకి కనపడడు శ్రీకృష్ణుడిని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేక పోతున్నాము అని శ్రీకృష్ణుడి కోసం పరితపించేవాళ్ళు. ఒకసారి మగనెమళ్ళూ  వచ్చి నాట్యం చేయటం మొదలు పెటింది. ఆకాశంలో చుస్తే మేఘం లేదు. ఐన నెమళ్ళు ఎందుకు నాట్యం చేస్తుంది అని చూడగా శ్రీకృష్ణుడు దూరం నుంచి వస్తున్నారు అంట. ఒక గోపకాంత ఇంకో గోపకాంతతో ఓ వనిత! శ్రీకృష్ణుడు నల్లని శరీరం కలిగి ఉంటాడు కదా అందుకే నెమళ్ళు ఆయనను చూసి నల్లని మేఘం అని అయన వాయిస్తున్న మురళీనాదం మేఘ గర్జన అని మనస్సులో బ్రహ్మపొంది నెమలి నాట్యం చేస్తున్నాయి. ఆ విధముగా శ్రీకృష్ణుడిని సేవిస్తున్నాయి. ఆ నెమళ్లకు ఉన్న జ్ఞానం మనకి లేకుండాపోయింది అని వాపోయింది. ఇంకో గోపకాంత ఎంత జ్ఞానం ఉంటె ఏమిటి శ్రీకృష్ణుడు ఇప్పుడు కనిపిస్తే అప్పుడు కనిపించడు. శ్రీకృష్ణుడిని చూస్తూ చనిపోవాలి అనిపిస్తుంది. శ్రీకృష్ణుడిని నిత్యం చూస్తూ, మాట్లాడుతూ, ఆయనతో ఆడుకుంటూ సేవిస్తూ చనిపోవాలి అని ఉంటుంది. కానీ అయన కనిపించడు ఎలా కనిపించి ఆలా మాయం అవుతారు ఎంత క్రూరంగా ఉన్నావు ఎప్పుడూ మీ ఆవిడా లక్ష్మి దేవికేనా మాకు కూడా కనిపించే మేము మాత్రం నీ సృష్టి కాదా అని అన్నది. ఇంకో గోపకాంత బ్రహ్మదేవుడు నాకు కనిపించాలి అయన పని చెపుతాని అయన సృష్టిలో ఎన్నిలోపాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కళ్ళను సృష్టించారు. కానీ కంటికి రెప్పలను పెట్టారు. శ్రీకృష్ణుడు కనిపించేదే అరుదు కనిపించినపుడే తనివితీరా చూద్దాము అంటే ఈ కంటి రెప్పలు అడ్డువస్తున్నాయి. ఈ కంటి రెప్పలు లేకపోతే ఎంత బాగుండును శ్రీకృష్ణుడిని తనివితీరా చూడవచ్చు అనుకున్నది. ఇంకో గోపకాంత  ఓ లక్ష్మివల్లభ! పగలంతా అడవిలో తిరుగుతావు అందుకని పగటిపూట నిన్ను చూడటానికి కుదరదు అప్పుడు మాకు ఒక నిమిషం కూడా ఒక యుగం లాగా గడుస్తుంది. తీరా సాయంత్రం అయింది నువ్వు వచ్చావు నువ్వు మీ ఇంటిలోకి వెళ్లే లోపు నిన్ను చూడము అనుకునే లోపు ఈ కంటి రెప్పలను అడ్డంగా చేసాడు ఆ విధాత ఎంత క్రూరుడు భారతి మాత మేము పైకి వచ్చిన తరువాత నీకన్నా మొరపెట్టుకుంటాము అను అన్న మా భాధని అర్ధం చేసుకొని నీ భర్తతో చేపి మాకు ఈ రెప్పపాటులు తీయించమ్మ కానీ నీ మాటకూడా అయన వింటాడో లేదో నీ మాట విని తరువాత ఆయనపని అయన చేస్తారేమో. అసలే శ్రీకృష్ణుడిని చూడగానే తన్మయత్వంతో కాంతిలో నేన్ను వస్తాయి అందువల్ల సగం చూడలేము మధ్యలో ఈ కంటి రెప్పలు అడ్డం వస్తున్నాయి అని అనుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...