శ్రీకృష్ణ- అడవిలో దావానలం

 శ్రీకృష్ణ- అడవిలో దావానలం

బృందావనంలోని అందరు ఎక్కడివాకదా వదిలేని పరుగుపరుగున్న వచ్చారు కదా. అందరికి కంగారు ఇంకా గుండెలు బాదుకుని ఏడవటం వలన అందరూ అలసిపోయారు. అందుకని శ్రీకృష్ణుడితో మనం అందరం అలసిపోయాము ఈరోజుకి ఇక్కడే ఉండిపోయి రేపుపొదున వెళదాము అని అనుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా సరే అన్నారు. అందరూ ఆహారం కూడా లేకుండా అందరూ ఎక్కడికక్కడే నేలపైన పొడుకున్నారు. మధ్యరాత్రి దాటినా తరువాత అది ఎండాకాలం అవటం వలన కొమ్మ కొమ్మ రాసుకొని అగ్ని అంటుకొని అడవిలో దావానలం అంటుకుంది. నిద్ర పోతున్నవారికి వేడి పొగ తగిలి అందరూ నిద్ర లేచి శ్రీకృష్ణ శ్రీకృష్ణ రక్షించి రక్షించు అని వేడుకున్నారు. బృందావన జనులు పొగాకు ఊపిరి ఆడక తలదిలిపోయారు. వారి అవస్థను చుసిన శ్రీకృష్ణుడు నన్ను నమ్ముతున్నారు కదా అయితే మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నారు. బృందావన జనులు అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే శ్రీకృష్ణుడు అగ్నిదేవా అడవిని కాల్చింది చాలు వెంటనే నా చేతులోకి రా అని అన్నారు. అగ్ని దేవుడు వెంటనే మహోగ్రరూపమైన తన రూపాని చిన్న దీపంగా మార్చుకొని శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చారు. శ్రీకృష్ణుడు ఆ అగ్నిని మిగేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అని అన్నారు. బృందావన జనులు అందరూ కళ్ళు తెరిచారు. అందరూ చుస్తే ఇంతకు ముందుకన్నా ఇప్పుడు అడవి పచ్చగా ఉంది. అప్పుడు బృందావన జనులకి శ్రీకృష్ణుడికి పైన ఇంకా నమ్మకం పెరిగింది. శ్రీకృష్ణ మమల్ని ఉన్నపలంగా బృందావనం తీసుకువెళ్ళు అందరికి ఆకలిగా ఉంది ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వచ్చాము అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయితే మళ్ళి అందరూ కళ్ళు మూసుకోండి అన్నారు. అప్పుడు ఒక గోపాలబాలురు శ్రీకృష్ణ నువ్వు ఏమిచేస్తావో నాకు తెలుసు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతు నేను ఏమిచేస్తాను అన్నారు. అప్పుడు గోపాలబాలురు ఇందాక నువ్వు అందరిని కళ్ళుమూసుకోమన్నారుకదా నేను మాత్రం మూసుకోలేదు. అప్పుడు నువ్వు ఆ అగ్ని వైపు చూసావు నువ్వు చూడంగానే ఆ అగ్ని నీ చేతులోకి వచ్చేసింది. దానిని నువ్వు మూగేసారు నేను చూసాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేనూ నిన్ను చూడదు అన్నాను కదా ఎందుకు చూసావు అన్నారు. ఎవరు చూడకపోతే నీమహిమలూ ఎవరుచెపుతారు. శ్రీకృష్ణుడు ఆ గోపబాలురికి ఈసారిమాత్రం అలంటి పని చేయకు అని మరీమరీ చెప్పారు. అందరిని కళ్ళు మూసుకోమని చెప్పారు. అందరూ కళ్ళుమూసుకున్నారు. కాసేపటికి అందరూ కళ్లుతెరచి చూసే సరికి ఎవరి ఇంట్లో వాలే ఉన్నారు. కళ్ళు తెరచి చుసిన గోపాలబాలుడు మాత్రం అక్కడే అడవిలోనే ఉండిపోయాడు. ఆ గోపాలబాలుడు పడుతూ లేస్తూ ఎనిమిది మైళ్ళు నడిచువచ్చేసరికి అతనికి బుద్ధి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...