ఫాల్గుణ మాసం విశిష్టత

ఫాల్గుణ మాసం విశిష్టత



శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన మాసాలలో పాల్గుణమాసం ఒకటి. పాల్గుణశుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు పయ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే అతిధి శ్రీమహావిష్ణువు అవతారమైన వామనుడికి పుత్రుడిగా పొందుతుంది. పాల్గుణశుద్ధ విదియనాడు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పాల్గుణ శుద్ధ చవితినాడు చతుర్ధ వ్రతం చేస్తారు. ఈ చతుర్ధ వ్రతానికి అవిజ్ఞ వ్రతము, పుత్ర గణపతి వ్రతము అని కూడా పిలుస్తారు. పాల్గుణ సుధా ఏకాదశిని అమలక ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి వారికీ  తిరుకల్యాణం చేస్తారు. ఈ రోజునే తిరుమల శ్రీవారికి తెపోత్సవం నిర్వహిస్తారు ఈ తెపోత్సవం ఐదు రోజులు నిర్వహిస్తారు.  పాల్గుణ పూర్ణిమ నాడు హోలీ పండుగా, హోళికా పూర్ణిమ, కామదహనం ఉత్సవం నిర్వహిస్తారు. పాల్గుణ బహుళ విదియనాడు లక్ష్మి దేవి పాలకడలి నుండి ఉద్భవిస్తుంది. పాల్గుణ బహుళ పంచమినాడు రంగ పంచమి నిర్వహిస్తారు. ఈ పండుగను కూడా హోలీ పండుగలగానే జరుపుకుంటారు. పాల్గుణ బహుళ సప్తమినాడు శీతల సప్తమిగా చేసుకుంటారు. ఈ రోజున శీతల దేవిని పూజిస్తారు. ఈ దేవిని పూజించటం వలన అంటువ్యాధులు, ఆటలమ్మ రావుఅని భక్తులు విశ్వసిస్తారు. పాల్గుణ బహుళ అష్టమినాడు సీతాదేవి భూగర్భం నుండి ఉద్భవిస్తుంది. పాల్గుణ బహుళ ఏకాదశినాడు పాపవిమోచన ఏకాదశి చేసుకుంటారు. ఇదే ఈ సంవత్సరంలో ఉండే చివరి ఏకాదశి. పాల్గుణ అమావాస్య నాడు పితృ తర్పణాలు నిర్వహిస్తారు. అంటే కాకుండా రామాయణంలో శ్రీరాముడు ఈ మాసంలోనే రావణాసుడి పై యుద్ధానికి వెళతారు. మహాభారతంలో కూడా పాల్గుణమాసంలోనే ధర్మరాజు, బీముడు జన్మిచారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...