మాఘ పురాణం 30

మాఘ పురాణం 30రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 30వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో మాఘమాసం చివరి రోజుకు వచ్చాము. మాఘ మాసం అమావాస్య గడియలు దాటకుండా మాఘ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో నది స్నానము విశేష పుణ్యఫలితం లభిస్తుంది. మాఘ పురాణం వినటం మాఘమాస వ్రతాన్ని ఆచరించటం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. భగవంతుని పూజ, సంకీర్తనలు, భజనలు చేస్తే ఆ భగవంతుడు ఎప్పుడు మన వెనంటి కాపాడతాడు. మరణాంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక మాఘమాస వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. పూర్వం అనంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తాతతండ్రుల నుంచి ఆస్థి సంక్రమించింది. అందువలన అతను పనిచేయటం మానేసి దురలవాటులకి లోనయ్యాడు. అతనికి సప్త వ్యసనాలు ఉన్నాయి. అలా కొంతకాలం గడిచాక అతనికి అనారోగ్యం వచ్చింది. దానితో అతని దగరకు ఎవరు రావటం మానేశారు. అతనికి పశ్చాతాపం మొదలయింది. అతని తల్లి తండ్రులు బ్రతికి ఉన్నపుడు అతనికి మాఘమాసం వ్రతాన్ని దానిని మహిమను చేపి ఒకసారైనా చేయమని చెప్పారు. నాకు వినలేదు ఎప్పుడు చేయలేని పరిస్థితి వచ్చింది. భగవంతుడిని తలచుకోవటం మొదలు పెట్టాడు. ఒకరోజు రాత్రి అతని ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఉన్న సోము అంత దొచ్చుకొని వెళుతుంటే ఈ అనంతుడు వాళ్ళ వెంట పడ్డారు. అలా వెళుతూ అతను ఊరిచివర నదిపైన ఉన్న వొంతెన దగరకు వచ్చారు వారితో పోట్లాడుతున్న సమయంలో ఒక దొంగతోసహా నదిలో పడి మరణించాడు. వాళ్ళని తీసుకువెళ్ళటానికి విష్ణుదూతలు వచ్చారు. అనంతుడు వారికీ నమస్కరించి మీరు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు అని అడిగాడు. అందుకు విష్ణుదూతలు అనంత నువ్వు దుర్మార్గుడివి. కానీ నీవు చేసిన పాపాలకి పశ్చాతాపం చెంది రోజు శ్రీహరిని తలుచుకున్నావు. అంతేకాక నీవు నదిలో పడిన సమయం మాఘమాస అమావాస్య గడియలు దాటలేదు అందువల్ల నీకు మాఘమాస స్నాన ఫలితము వచ్చింది. నీతోపాటు నీటిలో పడిన ఈ దొంగకి కూడా మాఘమాస స్నాన ఫలితము వచ్చింది. అందువలన మీకు వైకుంఠ ప్రాప్తి వచ్చింది అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 30వ రోజు పారాయణాన్ని చేపి ఓ శౌనకాది మునులారా! ఈ రోజుతో మాఘమాసం పూర్తవుతుంది. మాఘ పురాణం కూడా పూర్తవుతుంది. మాఘ పురాణంలో ఎన్నో కథలు చెప్పుకున్నాము. మహాశివుడు పార్వతిమాతకు చెప్పారు. అలాగే దిలిపామహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పారు. ఇంకా గృతజ్ఞ మహర్షి జ్నహుమహామునితో చెప్పారు. మధ్యలో కొన్ని కథలు దత్తాత్రేయ స్వామి కార్తవీర్జునుడికి చెప్పారు. ఈ మాఘ పురాణాన్ని శ్రీహరి, మహాశివుడి సమక్షంలో పారాయణం చేసిన అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయి. 


ఫలశృతి

ధర్మప్రబోధకమైన మాసాలలో ఉత్తమమైనది మాఘమాసం. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, దానాలు చేయటం వలన వచ్చే అంతటి పుణ్యం మాఘమాసా వ్రతం ఒకదాని చేయటం వలన వస్తుంది. మాఘమాసా వ్రతంలో సర్వ పుణ్యక్రియల నిక్షిత్మమైనవి. సర్వధర్మాలు ఇందులో ఉన్నాయి. శివ కేశవుల ఇద్దరికి ప్రతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని మరియు సకల దేవతల దయను కలిగిస్తుంది. సర్వ సుఖాలను ఇస్తుంది. నేను తెలుసుకున్నదని మీరు అడగంగానే చెప్పాను. సర్వ ధర్మాలు ఆచరించలేకపోయిన నారాయణ, కేశవ, మాధవ, వాసుదేవ, జనార్ధన అని పలికిన ఫలితం లభిస్తుంది. ఈ పురాణాన్ని శ్రీహరి సన్నిధిలో చెప్పేవారికి భక్తితో వినేవారికి ఇహమందు సర్వసుఖాలు, మరణించిన తరువాత శ్రీహరి సాన్నిధ్యాని పొందుతారు. సుతుడు ఈ విధముగా చేపి, సర్వరోగాలను పోగొట్టుతుంది. సర్వ ఐశ్వర్యాలను ఇస్తోంది. వినయ విధేయతలు కలిగినా వారికీ శ్రద్ధ కలిగినవారికి, మంచి నడవడిక కలిగిన వారికీ ఆత్మజ్ఞానికి ఈ వ్రతాన్ని చేయమని చెప్పాలి. ఈ విధముగా  సుతుడు శౌనకాది మునులకు చేపి మాఘ పురాణాన్ని పూర్తిచేశారు. ఇంతటితో మాఘ పురాణం సమాప్తమైంది. ఆ శ్రీహరి కరుణ అందరికి కలగాలని కోరుకుంటూ .............సమాప్తం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...