కంసవధ

కంసవధ




అక్కడ అంతపురం లో కంసుడు కంగారుగా ఆ శబ్దం ఏమిటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కొండి అని గూగులను ( గూడచారి లను ) పంపించాడు. కొంతసేపటి తరువాత వేగులు వచ్చి శ్రీకృష్ణుడు మేధస్సుని విరగ్గొట్టాడు అని ఇంకా శ్రీకృష్ణ బలరాములు అక్కడ చాపల వారిని కూడా చంపేశారు అని చెప్పారు. అందుకు కంసుడు ఇంకా భయపడిపోయాడు అనవసరంగా ఎక్కడో అడవిలో పల్లెటూర్లో ఉన్నవాడిని పిలిపించుకున్నా. నా చావుకు నేనే ముహూర్తం పెట్టుకున్నానని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి కంసుడికి అసలు నిద్ర పట్టలేదు. నిద్రపోతుంది ఒకసారి కలలో తాను విషం తాగినట్లు, ఒక్కోసారి శవాన్ని కౌగిలించుకున్నట్లు, సరే దిగంబరంగా తిరుగుతున్నట్టు, ఇంకోసారి ఒక నల్లని స్త్రీ ఎర్ర చీర కట్టుకొని కంసుడు మెడలో జిల్లేడు పూలమాలవేసిం వైపులా లాక్కెళ్ళి తున్నట్టు (మృత్యుదేవత తనను తీసుకు వెళుతున్నట్టు) కలలు వచ్చాయి. నిద్రపోతుంటే భయం వేస్తోంది అని అతని భార్యను కూడా నిద్ర పోనివ్వకుండా కంగారుగా కూర్చో పెట్టారు. నిద్ర లేకపోవటం వలన కంసుడి కళ్ళు ఎర్రగా అయ్యాయి. సూర్యోదయం అయ్యింది తరువాత శ్రీకృష్ణ బలరాములు, గోపాలబాలురు స్నానాదికాలు పూర్తిచేసుకుని వచ్చారు. శ్రీకృష్ణుడు గోపాలబాలురితో మీరు ముందు రంగస్థల ప్రాంగణానికి వెళ్ళండి. మేము తర్వాత వస్తాము అన్నారు. అప్పుడు గోపాలబాలురు అలాగే కృష్ణ నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాము. ముందు గోపాల బాలురు వెళ్లిపోయారు. వారు వెళ్ళిన కాసేపటికి శ్రీకృష్ణ బలరాములు బయలుదేరారు. చూడు వ్యాయామ పోటీలు కుస్తీ పోటీలు ఏర్పాటు చేశాడు. రంగస్థలం మధ్యలో ఉండే చుట్టూ కూర్చొని పోటీలను చూడటానికి ఏర్పాటు చేశారు. రంగస్థలం పైన కంసుడు మొత్తం కనిపించేలా కూర్చున్నారు. ఈ లోపు రంగస్థలం దగ్గరకు శ్రీకృష్ణ బలరాములు వచ్చారు. స్థలం ప్రవేశద్వారం దగ్గరకు వచ్చేసరికి కంసుడు ముందుగా ఏర్పాటు చేసిన మావటివాడు కువలయ పీడనం అనే ఏనుగుతో అడ్డంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు మావటివాడు తో ఏనుగు అడ్డంగా తీయి మేము లోపలికి వెళ్లాలి అన్నారు. ఇప్పటికే మావటివాడు ఆ ఏనుగుకి నల్ల మందు ఇచ్చి శ్రీకృష్ణ బలరాములను చంపెయ్యమని చెప్పారు. ఆ ఏనుగు శ్రీకృష్ణ బలరాములు మీదకు వచ్చింది. ఆసియా ఏనుగు ని పక్కకు తియ్యమని శ్రీకృష్ణ బలరాములు మళ్లీ మా వంటి వారితో చెప్పారు గాని వినలేదు. పైగా ఈ ఏనుగుతో నేను మిమ్మల్ని తొక్కి చంపేస్తాను రాజుగారు నాకు చాలా ధనం ఇస్తారు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మావటి వాడితో ఆ ఏనుగును అడ్డం తీస్తావా లేకపోతే పిడి గుడ్డులతో చంపేస్తాను అని అన్నారు. అయినా మావటివాడు వినలేదు. శ్రీకృష్ణుడు ఆ ఏనుగు దగ్గరకు రాగానే దాన్ని రెండుకాళ్ళమధ్యలో డోరి వెనక్కి వెళ్ళి దాని తోకను పట్టుకొని వెనక్కి లాగారు. అంత బలమైన ఏనుగు శ్రీకృష్ణుడు లాగిన బలానికి వెనక్కి వచ్చింది. శ్రీ కృష్ణుడు ఏనుగు ముందుకు వచ్చి దాని దండం పెట్టుకుని మూడుసార్లు తిప్పి అవతలికి పడేశారు. అయినా మావటివాడు వదలకుండా దానిని అంకుశంతో పొడిచి మళ్లీ శ్రీ కృష్ణ బలరాముల మేరకు ఉసిగొల్పాడు. శ్రీకృష్ణ బలరాములు కాసేపు ఆ ఏనుగుతో అటు తిప్పి ఇటు తిప్పి కాళ్ళ మధ్య దూరం ఆడుకున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా శ్రీకృష్ణ బలరాముల ఏనుగు దంతాల పైకెగిరి వాటిని విరిచేశారు. ఆ దంతాలతో ఆ ఏనుగు పెట్టెలో పొడిచారు. ఆ ఏనుగు మరణించింది. ఆ ఏనుగు కింద పడే టప్పుడు మావటివాడు కూడా దాని కింద పడి మరణించాడు. శ్రీకృష్ణ బలరాములు ఆ ఏనుగు తెల్లని దంతాలతో దాని రక్తం ఎర్రగా మారాయి వాటిని తన భుజాలపై వేసుకొని రంగస్థలంలో అడుగుపెట్టారు. వారిని అలా చూసిన కంసుడికి గుండెల్లో దడ మొదలైంది. కంసుడు మనసులో ఇలా అనుకున్నాడు. వీళ్లు పిల్లల పిశాచాల అంత ఏనుగు ని చంపేశారు చూస్తే 8 సంవత్సరాల బాలుడు లాగా కనిపిస్తున్నారు. ఒకవేళ నారదుడు చెప్పినట్టు శ్రీమహావిష్ణువే నాకు చావు తప్పదు అనుకొన్నాడు. వెంటనే ధైర్యం తెచ్చుకొని చాణూరముష్టికులవధ పిలిచి ఆ పిల్లలను చంపేయండి అని చెప్పారు. ఆ ఇద్దరు శ్రీ కృష్ణ బలరాముల దగ్గరకు వచ్చి శ్రీకృష్ణ బలరాములారా! మీకు ఏమన్నా విద్యలు వచ్చి ఉంటే మహారాజు ముందు ప్రదర్శించండి వాటిని మహారాజు చూసి ఆనందించి మీకు కానుకలు ఇస్తారు. మీరు బృందావనంలో కుస్తీ పట్లు పెట్టేవారని విన్నాము ఎందరో వీరులను ఓడించారని విన్నాము. మాతో కుస్తీ పట్లు పెట్టండి అన్నారు. ఇంకా చానురుడు పిల్లలారా ఇది బృందావనం కాదు నేను యుద్ధానికి పిలిచాడు అని వస్తారేమో ఒక్కసారి చూసుకోండి నేను ఒక గుడ్డు వద్దంటే మీరు చనిపోతారు అని విరాలు పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ ఎరగనట్టు అవును మేము బృందావనంలో ఆడుకున్నాము కానీ సరైన శిక్షణ తీసుకోలేదు మీకు లాగా అయినా రాజు గారు చూసి సంతోషిస్తారు కదా నేను నీతో యుద్ధం చేస్తాను. బలరాముడు ముష్టికూనితో యుద్ధం చేస్తారు. అది విని చానురుడు కోపంతో శ్రీకృష్ణుడికి ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టాడు. అది విన్న శ్రీకృష్ణుడు చానురుడిని రెండు కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశారు. బలరాముడు ముష్టికుడిని తాన పిడి గుడ్డులతో వేశారు. వెనకే ఉన్న మిగిలిన మల్లుల అందరూ శ్రీకృష్ణ బలరాములు మీదకి యుద్ధానికి వచ్చారు. వారినందరిని శ్రీకృష్ణుడు బలరాముడు చంపేశారు. అది కంసుడు పిచ్చి పట్టినట్టుగా గట్టిగా అరుస్తూ గోళ్లను చంపేయండి. దేవకీవసుదేవుల చంపేయండి. పిల్లలను చంపేయండి. ఉగ్రసేనుని చంపేయండి అరిచాడు. ఆ అరుపులు విని బట్టలు కిందకి దిగితే ముందే శ్రీకృష్ణుడు ఒక అంగతో కంసుడి దగ్గరకు వెళ్లి కత్తి తీసేసి కూడా ఇవ్వకుండా కంసుడి కిరీటాన్ని కిందపడేసి జుట్టు పట్టుకొని కిందకు ఈడ్చుకొచ్చి నేల మీదకు విసరగా అయిపోయాడు. అతని నుండి ఒక జ్యోతి పైకి వచ్చి శ్రీకృష్ణుడు లో కలిసి పోయింది. కంసుడి తమ్ముళ్ళు అయ్యా మా అన్నయ్యను చంపుతారా అని ఏగ్రూరుడు, ఉగ్రుడు, ఉజ్యాహనుడు, జిహ్యడు, మద్రిడు, గజేంధ్రుడు, విధముడు, వరసడు అనే ఎనిమిది మంది సోదరులు శ్రీకృష్ణుని మీదకి రాబోతున్నారు. వెంటనే బలరాముని ఆగ్రహించి ముళ్ళు ఉన్న ఇనుప కథను పట్టుకొని వారిని చంపేశారు. కంసుడు సోదర సమేతంగా చనిపోయారు. కంసుని భార్యలు వచ్చి భర్త మీద పడి ఏడుస్తూ మేము ఎంత చెప్పినా వినలేదు కదా శ్రీకృష్ణుడితో వైరం వద్దు అన్నావు అందరూ శ్రీకృష్ణుని చేరితే నువ్వు మాత్రం శ్రీకృష్ణుడితో వైరం తెచ్చుకున్నావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చే అత్తయ్యలు ఏడవకండి యుద్ధంలో మరణం సహజం. అమ్మలు మరణించినవారికి వీరస్వర్గం వారి పేరు చెప్పారు. కంసుడు అతని సోదరులకు దహన సంస్కారాలు నిర్వహించి వారి పేరున దానధర్మాలు చేయించారు. సిటీ భార్యలకు వారికి రావలసిన ఆస్తులను ఇప్పించి వారిని పుట్టింటికి పంపించారు. అందరూ ఊరట చెంది వెళ్లారు కానీ జరాసంధుని కుమార్తె అయిన ఆస్తి, ప్రాస్తీ కోపంతో నిన్ను మా నాన్న గారితో చెప్పి చంపేస్తాను అని వెళ్ళిపోయారు. తరువాత శ్రీకృష్ణుడు సరసాల పాలైన దేవకీవసుదేవుల దగ్గరికి వెళ్లి వారిని విడిపించి అమ్మానాన్న అని వారి కాళ్ళకు దండం పెట్టారు. కానీ శ్రీ కృష్ణ పరమాత్మ అని ఆయన మనస్సులో ధ్యానిస్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత తన ఎవరో చెప్పి తన విశ్వరూపాన్ని చూపించారు. వారి మనసులో భావం శ్రీకృష్ణుడికి అర్థం అయింది. వీళ్ళు నన్ను పరమాత్మ అనుకుంటే అలాగే ఉంటారో నాకు వీరు ప్రేమ లభించదు అని వారి మీద విష్ణుమాయ ప్రయోగించారు. దేవికి వసుదేవులు ఎన్నాళ్ళకు కనిపించావు నాయనా అని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు దేవుడు శ్రీకృష్ణుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మానాన్న నేను మీకు కుమారుడిగా పుట్టాను గాని కుమారుడిగా నా ధర్మాన్ని నెరవేర్చలేదు. ఇన్నాళ్లుగా మీరు చెరసాలలో బాధలు అనుభవిస్తూ ఉంటే మిమ్మల్ని విడిపించడానికి రాకుండా బృందావనంలో ఆడుకుంటూ ఉండిపోయాను. నన్ను క్షమించండి అన్నారు. దేవకీవసుదేవుల కి ప్రేమ ఎక్కువయ్యి మాట్లాడలేక అలాగే ఉండిపోయారు. తరువాత శ్రీకృష్ణుడు చెరసాలలో ఉన్న కంసుడి తండ్రి ఉగ్రసేనుని కూడా విడిపించారు. కృష్ణుడు ఉగ్రసేనుడితో మహారాజు యాదవులను రాజులు కాకూడదని శపించారు. కనుక మళ్ళీ మీరే గా ఉండండి మేము మీ వెనక సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రక్షిస్తూ ఉంటాము అన్నారు. నీకు నేను వరం ప్రసాదిస్తున్నాను మీరు కలియుగం అంతమయ్యేవరకు మొదలగు రాజుగా కొనసాగుతారు అని చెప్పి ఉగ్రసేనుని మహారాజుని చేశారు. తరువాత నందుడు ని పిలిచారు. నందుడికి ఇప్పటికే విషయం అర్థమైంది. శ్రీకృష్ణుడు నందునీతో నాన్న గారు మీకు ఇప్పటికే విషయం అంతా అర్థమైంది కదా. నేను మీ బిడ్డను కాను. దేవకీవసుదేవుల పెట్టను. నా ఆజ్ఞా మేరకి నన్ను అక్కడికి చేర్చారు. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ధర్మమార్గంలో మమ్మల్ని పెంచారు. తండ్రి నీ అనుగ్రహం వల్ల నీ దయవల్ల నీ ప్రేమ వల్ల నేను ఏ వయసుకే లీలలు చేయాలో అవి చేసి చూపించాను. నాకు మిమ్మల్ని విడిచి ఉండాలని లేదు కానీ లోకకల్యాణార్థం నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. నుంచి మేము ఇక్కడే ఉండాలి. అమ్మ అన్నం తినడం మానేస్తే నా మీద ఒట్టు అని చెప్పండి. అమ్మ నవత చేసే బాధ్యత మీదే అని చెప్పారు. అంత గంభీరమైన నందుడు కూడా శ్రీకృష్ణుని వదిలి వెళ్ళలేక శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఏడుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్లారు. వెళ్ళటం ఎలా ఉంది అంటే తల్లిని విడిచి బిడ్డ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నట్లు అన్నారు వ్యాసులవారు. శ్రీ కృష్ణుడు పరమాత్మ కనుక ఆయన చేయవలసిన కర్తవ్యం పనులు ఉన్నాయి కనుక ఈ భవబంధాలను అతీతంగా మసలుకున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...