గోపాలబాలురి కోరికను నెరవేర్చిన శ్రీకృష్ణబలరాములు

 గోపాలబాలురి కోరికను నెరవేర్చిన శ్రీకృష్ణబలరాములు



గోపాలబాలురితో శ్రీకృష్ణుడు అడవిలో తిరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నయ్య! ఈ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పారు. ఇంకా చెపుతూ ఈ చెట్లకి వినయం ఎక్కువ అవి నీకు సేవచేస్తున్నాయి అన్నారు. ఒక చోట మామిడి చెట్లకి బాగా పండ్లు కాసి చెట్టు కొమ్మలు కిందకు వొంగాయి. అవి బలరాముడు కాళ్లకుతగిలాయి. అది చూసి శ్రీకృష్ణుడు అన్నయ్య! ఈ చెట్లు బాగా పండ్లు కాసి ఈ పండోతో తమ కొమ్మలని ఇలా వొంచాయి. చెట్లకి కొమ్మలు చేతులు కృష్ణ బలరామ మీరు తొందరగా మా దగరకు రండి ఇవిగో మా చేతులతో ఈ పండ్లను మీ చేతులకి ఇస్తున్నాము మాకు పండ్ల బరువు ఎక్కువైపోయింది మాకు ఎందుకు ఈ పండ్లు మిరే స్వీకరించండి. ఈ పండ్లు మీరు స్వీకరిస్తే మా జీవితం ధన్యం అవుతుంది అన్నారు. అక్కడే ఉన్న ఇంకో గోపాలబాలురు అదేమిటి కృష్ణ చెట్లు వొంగాయి. పండ్లు కిందకి వేలాడుతున్నాయి. కానీ చెట్లు ఎప్పుడు మాట్లాడాయి అని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు చెట్లపైన చిలుకలు ఉన్నావు కదా అవి చెట్లు మాట్లాడినవి నాకు చెపుతున్నాయి అని చెప్పారు. మళ్లీ శ్రీకృష్ణుడు అన్నయ్య! ఆ పండ్లను తీసుకొని తిని వాటికీ మోక్షాన్ని అనుగ్రహించు అన్నారు. అప్పుడు బలరాముడు ఆ పండ్లను తీసుకొని అందరికి పంచి కొంచం పండుని శ్రీకృష్ణుడికి తినిపించి తాను తిన్నాడు. ఇంకొంచం ముందుకు వెళ్లారు. అక్కడ గడ్డిపరకలు ఉన్నాయి. వాటిపై శ్రీకృష్ణుడు బలరాముడు కాళ్ళు పెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నయ్య! ఈ గడ్డిపరకలు ఎంత అదృష్టం చేసుకున్నాయి కదా. వాటికీ నీ పాద స్పర్శ తగిలి అడవి జన్మ ధన్యం అయింది. ఇంకొంచం ముందుకు వెళ్లారు. అక్కడ కొన్ని చిన్ని చిన్నచిన్న పిట్టలు, ఎలుకలు, కుందేలు అటుఇటు పరుగెడుతూ బలరాముడు కాళ్లకు తగిలాయి. అన్నయ ఇందాక గడిపారకాలని అనుగ్రహించవు. ఇపుడు ఎలుకలని, కుందేలని, పిట్టలని అనుగ్రహించవు. ఇపుడు వీటిని కూడా అనుగ్రహించు అని అన్నారు శ్రీకృష్ణుడు. ఇలా శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడితో మాట్లాడుతూ ఉండగా ఆవుదూడలు గడ్డిని మేస్తూ దూరంగా వెళ్లాయి. అవి ఏ క్రూరజంతువు బారిన పడతాయోనని వాటిని శ్రీకృష్ణుడు ఇలా పిలవసాగారు. ఓ మహాలక్ష్మి, సర్వ మంగళ, మంగళ, పూర్ణచంద్రిక, భగీరధి, గంగా, సరస్వతి, మందాకిని, సుబంగి, ధరిత్రి, భారతి, మేఘమాలిక, చింతామణి, సురభి, గౌతమి, మనోహారిణి రా రా రండి రండి అని పిలిచారు. శ్రీకృష్ణుడు విన్న వెంటనే ఆవుదూడలు అంబ అంబ అంటూ చెంగు చెంగున పరిగెత్తుకు వచ్చాయి. శ్రీకృష్ణుడిని చుట్టు తిరగసాగాయి. అది చుసిన దేవతలు శ్రీకృష్ణ ఆవుదూడలు ఎంత పుణ్యం చేసుకున్నాయి. నీచేత పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాయి. మాకు ఆ అదృష్టం లేదుకదా అనుకోని పైనుంచి పుష్ప వర్షం కురిపించారు.బ్రహ్మదేవుడు అయితే ఈయనేనా మా నాన్న గారు సమస్త బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఈయన ఈ రోజు ఒక చిన్న బాలుడి రూపములో బృందావనంలో గోపబాలురితో ఆవుదూడలతో ఆడుకుంటున్నారా ఎన్ని లీలలు చేస్తున్నారో. ఎందుకు ఈ బ్రహ్మ పదవి అనుకున్నారు. కొంత సేపటి తరువాత ఆవుదూడలతో ఆడుకుంటూ ఉండగా గోపాలబాలురు శ్రీకృష్ణుడి దగరకు వచ్చి శ్రీకృష్ణ మేము అలసిపోయాము అక్కడైనా విశ్రాంతి తీసుకుందాము అన్నారు. శ్రీకృష్ణుడు గోపాలబాలురని తీసుకొని ఒక కొండగుహ దగ్గర కాసేపు పొడుకోబెట్టారు.ఆ కొండగుహ అనుకుందా. ఆహా ఏమి నా అదృష్టం నేను బండరాయిగా పుట్టాను అనుకున్నాను. కానీ ఈ రోజు శ్రీకృష్ణుడి పాదస్పర్శ తగిలి నా జన్మ ధన్యం అయింది. బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతి దేవి ఇలా అనుకుంది. ఉపనిషత్తుల వర్ణనలో ఉండే అయన ఇప్పుడు వైకుంఠాన్ని వదిలి ముళ్ళతో, బండరాళ్లతో కూడిన అడవుల్లో తిరుగుతున్నారు. ఎప్పుడు మెత్తగా ఉంటే ఆదిశేషుడి పరుపుపైన పోసుకునే స్వామి ఇపుడు అడవిలోని ఈ కొండగుహలో ఆకులను పరుచుకొని పొడుకున్నారు. యోగుల హృదయాలలో ఉండే అయన ఈ రోజు అడవిలోని కొండగుహలలో విహరిస్తున్నారు. లక్ష్మీదేవితో సరదాగా కుస్తీపట్లు పట్టుకొని ఆడుకుంటూ తిరిగే అయన ఈ రోజు గోపాలబాలురితో కుస్తీపట్లు పడుతున్నారు. యజ్ఞంలో పూర్ణాహుతిని స్వీకరించే స్వామి ఇప్పుడు అడవిలో పండ్లను తీసి వాటిని దీవిస్తున్నారు. అన్ని లోకాలకి అభయం ఇచ్చే స్వామి ఇప్పుడు అలసిపోయి చెట్ల నీడలో నిదురిస్తున్నారు. నీతో తిరిగే భాగ్యం నాకు కలగలేదు కదా అనుకుంది. అలా వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకోగానే శ్రీకృష్ణుడి దగ్గరకి బలరాముడు దగరకు పిలలువచ్చారు. ఇద్దరు పిల్లలు శ్రీకృష్ణుడి పదాలు వొత్తుతున్నారు. ఇంకో ఇద్దరు బలరాముడు పాదములు ఒత్తుతున్నారు. బలరామ, శ్రీకృష్ణ మీరు కరణ జన్ములు మహానుభావులు మీరు తలచుకుంటే చేయలేనిది. మాకు చాలాకాలం నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరికను తీర్చండి అన్నారు. వాళ్ళ పేర్లు శ్రీధాముడు, సుదాముడు, స్వధాముడు, శూధముడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నయ్యని అడగండి తీరుస్తాడు అన్నారు. బలరామ కొండంత బలం కలిగిన వాడివి. నీ బలం వల్ల మాకు ఆనందం కలిగిస్తావు. అందుకే అడుగుతున్నాము. మా కోరికను నిజంగా తీరుస్తావా అని అడిగారు. అప్పుడు బలరాముడు ఏమిటో చెప్పండి తీరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలబాలురు అక్కడ దూరంగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లతో కూడిన ఆ వనం తాలవనం. ఆ తాటిచెట్లకి మంచి తాటిపండ్లు కాసాయి. ఆ పండ్లు ముగిపోయి కోసేవాళ్లు లేక కిందపడిపోతున్నాయి. అన్ని తాటిపండ్లు ఉన్న తినటానికి ఎవరు అక్కడికి వెళ్లారు. ఆ వనంలో గాడిద రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడి పేరు ధేనుకాసురుడు. వాడికి ఇద్దరు భార్యలు. వాళ్ళు గాడిదలే. వాళ్ళకి పదివేలమంది సంతానం ఉన్నారు. వాళ్ళు గాడిదలే. వాడికి సోదరులు, వారి భార్యలు, పిల్లలు అందరూ గాడిదలే. వాళ్ళ వల్ల ఆ వనంలోకి ఎవరు వెళ్లిన వాళ్లని చంపేస్తూ ఉంటారు అందుకే ఎవరు వెళ్లలేక పోతున్నారు. మాకు చాలాకాలం నుంచి ఆ పక్కగా వెళుతునపుడు ఆ పండ్ల వాసనకు వాటిని తినాలని కోరిక కలిగింది. మాకు కొంచం తాటి పండ్లు పెట్టారా. అందుకు శ్రీకృష్ణుడు బలరాముడు నవ్వుకొని సరే తీరుస్తాను. శ్రీకృష్ణ, బలరాముడు గోపాలబాలురని వెంటపెట్టుకొని ఆ వనంలోకి వెళ్లారు. వాళ్ళు వెళ్లే సమయానికి చెట్ల నుంచి పండ్లు కింద పడుతున్నాయి. అది చుసిన గోపాలబాలురు బలరామ బలరామ తినేస్తున్నాము. నువ్వే చూసుకో ఆ రాక్షసుడి సంగతి అన్ని తినటం మొదలుపెట్టారు. ఆ ధేనుకాసురుడిని చంపాలని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పాడు. అందుకని బలరాముడు ఆ ధేనుకాసురుడిని బయటకు రాపించటానికి అన్ని తాటిచెట్లను గట్టిగ పట్టుకొని వాటిని ఊపుతూ పండ్లను రాల్చటం మొదలుపెట్టాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...