గోపికల కాత్యాయని వ్రతం

 గోపికల కాత్యాయని వ్రతం


మార్గశిరం, పుష్యం రెండు మసాలాను హేమంత ఋతువు అంటారు. మొదటిమాసమైన మార్గశిర మాసంలో గోపికలంతా ఒక వ్రతాన్ని చేయటానికి సిద్ధమయ్యారు. నందవ్రజంలో ఉన్న గోపికలంతా కలిసి ఒకసారి అనుకున్నారు. మన అందరికి కృష్ణుడే భర్తగా రావాలి అందుకని కాత్యాయని వ్రతం చేద్దాము. ఆ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తారు అని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకని మనం కాత్యాయని అమ్మవారిని పూజ చేద్దాము. అదికూడా నేతితో నింపిన అన్నని అమ్మవారి యజ్ఞంలో సమర్పించి మిగిలిన అన్నాన్ని ఆహారంగా స్వకరిద్దాము. అనుకోని రోజుకి ఒక పుట మాత్రమే భోజనం చేసారు. చలికాలంలో రోజు తెల్లవారుజామున మూడు గంటలకి నిద్రలేచి బయటకు వచ్చారు. మెలకువ రాక నిద్రపోతున్న వారిని నిద్రలేవమని లేపారు. అందరూ కలసి కట్టుగా యమునా నది దగ్గరకు ఒకరి చేయి మరొకరు పట్టుకొని కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా నదిదగ్గరకు వెళ్లారు. యమునా తీరమునకు చేరాక ఎవరు లేని నిర్జన ప్రదేశములో దాగంబరంగా స్నానానికి దిగి స్నానం చేసారు. చేసిన తరువాత ఒడ్డుకు వచ్చి బట్టలు ధరించి కాత్యాయని అమ్మవారి విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసారు. అమ్మవారికి చామంతి పువ్వులతో కలువ పువ్వులతో తమర పువ్వులతో పూజించారు. నేతి అన్నాన్ని నివేదించి అమ్మవారికి ఉన్న నామాలన్ని చదువుకున్నారు. పూజ అయినా తరువాత తమకు శ్రీకృష్ణుడిని భర్తని చేయమని అమ్మని అడిగేవారు. ఓ భగవతి కాత్యాయని మా అందరికి త్వోరగా శ్రీకృష్ణుడిని భర్తగా చేయి అమ్మ. మాకు శ్రీకృష్ణుడు హృదయవలభుడు(ఆత్మకు భర్త) అయితే పరమాన్నమును, నేతితో చేసిన లడ్డులతో నైవేద్యము చేసి నేతి హోలీ చేస్తాము. లడ్డులతో జాతర చేస్తాము. అని మొక్కుకున్నారు. ఏ విధముగా గోపికలంతా వృత్తం చేస్తుండగా ఇంకా వ్రతం రెండు మూడు రోజులలో అవుతుందనగా శ్రీకృష్ణుడు గోపబాలురతో రేపు అందరూ మూడు గంటలకే నిద్రలేవండీ అందరం అప్పుడే అడవికి వెళదాము అన్నారు. శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే గోపాలబాలురు ఎదురు చెప్పేవారు కాదు. అయన ఏమి చెపితే అదే చేసేవారు. అందరూ మరుసటి రోజు తెల్లవారుజామున నిద్ర లేచారు. ఆ రోజు బలరాముడుని మాత్రం తీసుకెళ్లలేదు. శ్రీకృష్ణుడు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి హరిచేందనం పూసుకొని తిరునామం దిద్దుకొని అందరూ భయాలుదేరారు. శ్రీకృష్ణుడు క్రమంగా గోపికలు అందరూ స్నానం చేస్తున్న దగ్గరకు వెళ్లారు. గోపాలబాలురని తన కన్ను సైగలతో కదలకుండా నిలిపి వేసి శబ్దం చేయకుండా మెల్లగా గోపికలు స్నానం చేస్తున్న దగ్గరకు వెళ్లి వారి విడిచిన చీరలను అన్ని పట్టుకొని చెట్టు ఎక్కారు. ఆ చెట్టు కదంబ వృక్షం. శ్రీకృష్ణుడి పాదస్పర్శ తగలగానే ఆ చెట్టు నుంచి ఒక దివ్య పూరుషుడు బయటకు వచ్చాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి స్వామి! గోలోకంలో రాధాదేవి ఇచ్చిన శాపం వలన ఈ వృక్షం గా నీ పాదస్పర్శ వలన నాకు శాపవిమోచనం అయింది అని నమస్కరించి గోలోకానికి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు చీరలు పట్టుకొని ఒడిలో పెట్టుకొని కూర్చున్నారు. అంతలో గోపికలు చూసుకొని శ్రీకృష్ణుడే తమ చీరలు తీసుకువెళ్లారు అని తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడిని బ్రతిమిలాడుకొంటున్నారు. శ్రీకృష్ణ మా బట్టలు ఎందుకు తీసుకెళువు. మా మన్నాని ఎందుకు తీసుకెళతావు. మేము దిగంబరంగా నదిలో ఉన్నాము. అసలే ఏది చలికాలం మాకు చలివేస్తుంది. మా బట్టలు మాకు తిరిగి ఇచ్చేయి. ఇవ్వకపోతే నందరాజుకి చెపుతాము. ఆడవాళ్లు స్నానం చేస్తుంటే ఒకవేళ మొగవారు పొరపాటున్న అక్కడికి వస్తే కళ్ళు మూసుకొని వెళ్లిపోవాలి అని అంటారు. ఒకవేళ పొరపాటున వచ్చావు అనుకో తామంతా తాము పక్కకి వెళ్లిపోవాలి కానీ ఎలా చీరలు ఎత్తుకెళతారా. దయ లేకుండా మమల్ని ఏడిపిస్తావా. మా మాట విను కృష్ణ మా బట్టలు మాకు ఈపించావు అంటే నీకు శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాము. నీకు దాసులమై నిన్ను సేవిస్తూ ఉంటాము. మమల్ని అనుగ్రహించు మా బట్టలు మాకు ఇపించు అని వేడుకున్నారు. నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తాలి. అందరిని రక్షించాలి. లోక సంరక్షణ చేయాలి అంతే కానీ ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళటం నీకు ధర్మమా శ్రీకృష్ణ నీకు పుణ్యం ఉంటుంది మా బట్టలు మాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే యశోదమ్మకు చెపుతాము అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయితే వెళ్లి రండి అని అన్నారు. అప్పుడు గోపికలు వెళ్లలేము కనుకనే నిన్ను బ్రతిపిలాడుకుంటున్నాము. అప్పుడు అన్ని విని శ్రీకృష్ణుడు బయటకు వస్తే మీకు బట్టలు ఇస్తాను అన్నారు. అప్పుడు గోపికలు ఎలావస్తాము శ్రీకృష్ణ అన్నారు. అప్పుడు కృష్ణుడు ఎలా వస్తాము అన్నపుడు నదిలోకి దిగంబరంగా ఎందుకు వెళ్లారు. స్త్రీలు నదిలోకి స్నానానికి వెళితే అలా దిగంబరంగా వెళ్లకూడదు. వస్త్రాలు ధరించి వెళ్ళాలి. ఎవరు రారు అని మీరు అనుకోవద్దు. ఇది నది ఎవరైనా ఎపుడైనా ఎక్కడికి రావచ్చును. ఎటువంటి ప్రదేశానికి వేచి వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చా. మీ పొరపాటు మీరు గ్రహించక కృష్ణ రాకూడదు. వచ్చిన ఎటు చూడకూడదు అంటారా. మీకు వస్త్రాలు కావాలి అంటే నీటిలోనుంచి బయటకు వచ్చి అడిగితే ఇస్తాను అన్నారు. గోపికలు తమలో తామే చేర్చించుకొని అందరూ ఒక మాట అనుకోని శ్రీకృష్ణుడి కోసమే కదా ఈ వ్రతం చేసాము అయన దగర సిగ్గు ఎందుకు అని అందరూ నీటిలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించండి అన్నారు. అప్పుడు గోపికలు రెండుచేతులు ఎత్తి నమస్కరించారు. శ్రీకృష్ణుడు వారి వస్త్రాలు ఇచ్చి గోపికలారా ! మీరు చేస్తున్న వ్రతంలో లోపం ఉన్నదీ. దాని వలన కాత్యాయని మాతకు కోపం వచ్చింది. నేను ఆ లోపాన్ని సరిచేయడానికి వచ్చాను. మీరు నదిలో ఎలా దిగంబరంగా స్నానం చేయకూడదు. ఇంట్లోనే చేయకూడదు అంటే మీరు నదులోనే చేస్తున్నారు ఇది మహాపాపం. మీరు నన్ను ఆరు సంవత్సరాల బాలుడిగా మాములు మనిషిగా అనుకుంటే నేను అల్లాగే ప్రవర్థించేవాడిని. నేను పరమాత్మను, పరబ్రహ్మను అని తెలుసుకున్నారు. అందుకని మీ లోపాలను సరిచేయడానికి వచ్చాను. పరమాత్మ భర్తగా రావాలి అంటే దేహభ్రాంతిని వదిలేయాలి అవధూతగా మారాలి. సృష్టిలోని చిన్న అణువు నుంచి సమస్త బ్రహ్మాండాలలో నేనే నింది ఉన్నాను. నేను చూడని మర్మాలు మీకు ఎక్కడ ఉన్నవి. సమస్త ప్రాణులను  సృష్టించి పోషించి లయం చేసేది నేనే నాకు తెలియని మర్మాలు మిలో ఎక్కడ ఉన్నాయి. ఇకమీదట ఎటువంటి తప్పు చేయకండి. ఎప్పుడు నదిలోకి దిగంబరంగా వెళ్లకండి అని మందలించారు. అప్పుడు గోపికలు మనం ఎంత పొరపాటు చేసాము. వ్రతంలో లోపం జరిగింది. వస్త్రాపహరణం అంటే దేహభ్రాంతి పోవటం, జీవభ్రాంతి పోవటం. శ్రీకృష్ణుడు అంటే జగత్తుకు గురువు అయన చూపిన మాటవినలేదు అందుకనే ఇంకో లోపం వచ్చింది. ఇంకోసారి శ్రీకృష్ణుడిని మనసారా నమస్కరిధ్దము అని మళ్ళి నమస్కరించారు. అలా నమస్కరించంగానే వారిలో ఉన్న జీవాత్మ పరమాత్మ అయినా శ్రీకృష్ణుడిని కలిసింది. వాళ్ళు వస్త్రాలు ధరించి ఇంకా మేము ఇంటికి వెళ్లము అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అలాచేయకూడదు ఇంకా రెండు మూడు రోజులు వ్రతం ఉంది.దానిని పూర్తి చేయండి. నా శరీరం పరమ పవిత్రమైన శరీరం. ఇది కామ శరీరం కాదు యోగ శరీరం. ఐన మీరు భోగాలు కోరుకుంటున్నారు కనుక శరత్ కాలములో మీతో కలిసి నాట్యం చేస్తాను మీ కోరికను నెరవేరుస్తాను. ప్రస్తుతానికి మీరు వెళ్లిపోండి అని చెప్పారు. అప్పుడు గోపికలు శ్రీకృష్ణుడి నుండి సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన తరువాత ఆత్మ పరమాత్మను వదలలేదు అన్నటుగా శ్రీకృష్ణుడిని వదలేక వదలేక వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్లలేక వెళ్లలేక వెళ్లారుఅప్పుడు శ్రీకృష్ణుడు గోపాలబాలురని మాయ నుండి బయటకు తీసుకు వచ్చారు. అప్పుడు గోపాలబాలురు శ్రీకృష్ణ  ఏమైంది అని అడిగారు. ఏమి కాలేదు మనం అడవిలోకి వెళదాము పదండి అని గోపాలబాలురతో శ్రీకృష్ణుడు గోవులను తోలుకుంటూ వెళ్లారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...