అవయవ దానం చేయడం వలన పాపమా? పుణ్యమా?


మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్నపుడు ధర్మరాజు రొమాస మహర్షి తీర్ధయాత్ర చేస్తూ బుతుంగపర్వతం దగ్గరకు వచ్చారు. అపుడు రొమాస మహర్షి ధర్మరాజుతో "ధర్మరాజా! ఇక్కడే శిబి చక్రవర్తి అను రాజు ఒక గొప్ప యజ్ఞం చేసారు." ధర్మరాజు ఏమి యజ్ఞం మహర్షి ఆ వివరాలు చెప్పండి" అని అడిగారు. 

అందుకు రోమాస మహర్షి " ధర్మరాజు ఇక్కడ శిబి చక్రవర్తి పరిపాలన చేసారు. అయన పాలనలో దానధర్మలు బాగా చేసారు. అయన దగరకు ఏదికోరివచ్చిన లేదు అనకుండా దానం చేసారు. ధర్మబద్ధంగా పరిపాలించారు. అయన కీర్తి లోకం అంతా తెలిసింది. ఒక రోజు ఇంద్రుడు కొలువులో ఉండగా శిబి చక్రవర్తి గురించి ప్రస్తావన వచ్చింది. కొలువులో కొంతమంది శిబి చక్రవర్తి గొప్ప దానశీలి అని మరికొంతమంది తనదాకా వస్తే గాని తెలియదు అని అన్నారు. అయితే పరీక్షించవలసిందే అని ఇంద్రుడు అన్నారు. కొంత సమయం తరువాత భూలోకంలో శిబి చక్రవర్తి తన రాజ్యసభలో ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పావురము అయన దగరకు వచ్చి మహారాజ నన్ను రక్షించు నన్ను డేగతరుముకుంటూ వస్తుంది నా ప్రాణాలను కాపాడు అని అడిగింది. శిబి చక్రవర్తి ఇదేమిటి పావురము మాట్లాడుతుంది అని అలోచించి ఏమయితే ఏమిటి ఆ పావురము నన్ను శరణు వేడింది ధర్మబద్ధంగా ఎవరైనా తనని శరణమని వేడిన వారిని తాను రక్షించాలి అనుకోని పావురముతో నీకు ఏమిభయము లేదు పావురమా నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చారు . పావురము వచ్చి అయన సింహాసనము చేయిపెటుకునే దగర కూర్చుంది. ఇంతలో డేగ అక్కడికి వచ్చి పావురమును పట్టుకోబోతుంటే శిబిచక్రవర్తి డేగ ఆడుకొని ఈ పావురము నను శరణు వేడుకుంది నేను దీనిప్రాణాలను రక్షిస్తాను అని మాట ఇచ్చాను. ఈ ఒక పావురమును వదిలేసి నువ్వు అడవికి వెళ్లి వేరే ఆహారాన్ని వెతుకోమన్నారు.

 అందుకు డేగ మాట్లాడుతూ "చక్రవర్తి! నేను నీ ధర్మశీలత గురించి విన్నాను. పావురము నిను శరణు వేడింది దానిని రక్షిస్తాను అంటున్నావు శర్మమే నాకు మూడు రోజులగా ఆహారము లేదు నాకు మళ్ళీ అడవికి వెళ్లి ఆహారం వెతుక్కునే ఓపిక లేదు నేను ఆహారం లేక మరణిస్తే అది నీకు అధర్మం కదా. నీకు అధర్మం చేసిన పాపం అంటుకోదా! నా ఆకలి సంగతి ఏమిటి మరి" అని అడిగింది. అందుకు శిబి చక్రవర్తి  "ఓ డేగా! నువ్వు ఆకలితో మరణించటం పాపమే. కానీ నేను పావురానికి అభయం ఇచ్చాను. పావురానికి బదులు నా శరీర మాంసాన్ని నీకు ఇస్తాను అన్నారు". అందుకు డేగ ఒప్పుకుంది. శిబి చక్రవర్తి ఒక త్రాసుని తెప్పించి ఒకవైపు పావురాన్ని ఉంచి మరొకవైపు తనతోడనుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశారు. కానీ పావురమే బరువు ఉంది. చక్రవర్తి ఎంతమంసాని వేసిన పావురమే బరువు ఉంటుంది ఎలా కాదు అని తానే స్వయంగా త్రాసుకో కూర్చొని డేగా నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో అని చెప్పారు. వెంటనే డేగ ఇంద్రదేవుడిగా పావురము అగ్నిదేవుడిగా మారిపోయారు. శిబి చక్రవర్తిని మళ్ళీ మాములుగా మార్చారు. ఆకాశం నుంచి దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. ఇంద్రుడు శిబి చక్రవర్తితో " చక్రవర్తి! నేను నీ దానశీలతకి, ధర్మనిరతికి మెచ్చాను. ఈ సృష్టిలో "ఓంకారం" ఉనంత వరకు నీపేరు వినిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు ధర్మబధంగా ఎవరైతే ఇంకొకరికి జీవితాన్ని ప్రసాదించటానికి వారి అవయవాలను దానం చేసిన వీరికి పుణ్యం లభిస్తుంది' అని వరం ఇచ్చి వెళ్లిపోయారు. రొమాసమహర్షి ధర్మరాజుతో "ఇది మహారాజ శిబి చక్రవర్తి కథ. నువ్వు కూడా అయన లాగా ధర్మతప్పకుండా పరిపాలించు" అని చెప్పారు.                   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...