రోమాస మహర్షి ఆయువు వింటే కళ్ళు తిరిగి పడిపోవలసిందే !

ఒకసారి ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి నాకు ఒక భవనాన్ని కట్టి ఇవ్వు అని ఆ భవనం ఇంతవరకు ఎవరు చూడనటువంటిది నాకు కట్టి ఇవ్వమని ఆజ్ఞాపించారు. అలాగే అని విశ్వకర్మ ఒక మంచి భవనాన్ని కట్టి ఇచ్చారు. ఇంద్రుడు వచ్చి చూసి నాకు ఈ భవనం నచ్చలేదు. కూల్చేసి మళ్ళీ కట్టు అని అన్నారు. విశ్వకర్మ మళ్ళీ ఇంకా మంచిగా భవనాన్ని నిర్మించారు. ఇంద్రుడు మళ్ళీ నచ్చలేదు అని మళ్ళీ కటామన్నారు. ఎలా ఒకసారి కాదు, రెండు సారులు కాదు వేయి సారులు జరిగింది. విశ్వకర్మకు విసుగు వచ్చింది. ఇంద్రుడికి ఎలాగా భవనాన్ని కట్టిన నచ్చటం లేదు అని ఆలోచించసాగారు. ఈలోపు అక్కడకి నారదమహర్షి వచ్చారు. నారద మహర్షికి  విశ్వకర్మ నమస్కరించి స్వామి ఇంద్రుడికి ఎంతబాగా భవనాన్ని కట్టిన నచ్చటంలేదు. నను ఈ భవనాల బారినుండి నన్ను రక్షించండి అని తన ఆవేదనని వెళ్లబోసుకున్నారు విశ్వకర్మ. నారదమహర్షి విశ్వకర్మతో అలాగే నేను నిన్ను ఈబాధనుంచి తపిస్తాను అని ఇంద్రుడు దగ్గరకు వెళ్లరు. ఇంద్రుడు నారదమహర్షికి నమస్కరించారు. నారదమహర్షి ఇంద్రుడితో మనం ఇపుడే భూలోకానికి వెళదాము అన్నారు. అలాగే అని భూలోకానికి బయలుదేరారు. వారు ఇద్దరు భూలోకంలోని దండకారణ్యానికి వచ్చారు. అక్కడ ఒక మహర్షి చిరిగినా చాపాను నెత్తిమీద పెట్టుకొని కింద ఒకదర్బను వేసుకొని దానిమీదకూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. అయన శరీరమంతా వెంట్రుకలతో నిండి ఉంది. ఛాతీమీద మాత్రం నున్నగా ఉంది.  


   

నారదమహర్షి వచ్చి ఆయనకు నమస్కరించారు. ఇంద్రుడు కూడా నమస్కరించారు. నారదమహర్షి ఇంద్రుడితో అయన రోమాస మహర్షి అని పరిచయం చేసారు. నారద మహర్షి ఏమి తెలియనట్టుగా రోమాస మహర్షి మీ లాంటి చాలామంది మహర్షులు ఆశ్రమాలు కట్టుకున్నారు. మీరు ఎందుకు ఆశ్రమం కట్టుకోలేదు అని అడిగారు. అందుకు రోమాస మహర్షి నాకు ఎందుకయ్యా ఆశ్రమాలు నేను అల్పాయుస్కుడిని అన్నారు.ఈ మాట ఇంద్రుడు విని రోమాసమహర్షి మీరు అల్పాయుస్కుల నా దగ్గర అమృతం ఉంది అదిమీకు ఇస్తాను మీ ఆయుష్షు ఎంత అని అడిగారు. అపుడు రోమాస మహర్షి నాకు ఎందుకు అమృతం వద్దు నాకు ఈ తపస్సు చాలు అన్నారు. అపుడు ఇంద్రుడు పర్వాలేదు చెప్పండి అన్నారు. సరే నువ్వు అడిగావు కాబట్టి చెపుతాను కానీ నేను అల్పాయుష్కడిని (కలియుగం - 432000 + ద్వాపరయుగం + 864000 , త్రేతాయుగం + 1296000 + కృతయుగం - 1728000 ) మొత్తం 4320000 ఒక యుగం ఒక ఇంద్రుడు వెళ్లిపోతారు. ఆలా ఇంద్రుడు వేయిమంది వెళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు అంటే 4320000 * 1000 , అలాగే బ్రహ్మగారికి ఒక రాత్రి 4320000 * 1000 మొత్తం 8640000000 బ్రహ్మగారికి ఒక రోజు. బ్రహ్మగారికి ఒకసంవత్సరం 8640000000 * 360 = 3110400000000 ఆలా బ్రహ్మగారికి ఒక 100  సంవత్సరములు 3110400000000 * 100 = 311040000000000 బ్రహ్మగారికి ఆయువు తీరుతుంది. ఆలా ఒక బ్రహ్మ వెళిపోతే న ఒంటిమీద ఒక వెంట్రుక ఊడుతుంది. ఆలా ఊదిన వెంట్రుకలు వలన నా చాతిమీత బేతేడు కాలి వచ్చింది. నా ఒంటిమీద ఉన్న వొంట్రుకలు అన్ని ఉండితే నేను మరణిస్తాను అల్పాయుస్కుడిని నాకు ఎందుకు అమృతం వద్దు అన్నారు. ఇంద్రుడు విని కళ్ళు తిరికి పడిపోయారు. ఇంద్రుడు ఇచ్చిన తరువాత ఇంత ఆయుష్షు ఉన్న ఆయనే ఏమి లేకుండా ఉన్నారు. నేనేమో విశ్వకర్మ ఎన్ని భవనాలు కట్టిన నచ్చటం లేదు అంటున్నాను. నాకు జ్ఞానోదయం అయింది అని వెంటనే స్వర్గానికి వెళ్లి భవనం నిర్మాణాన్ని ఆపించేసారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...