శ్రీకృష్ణ

శ్రీకృష్ణ లీలలు

ఇంకో గోపకాంత కృష్ణుడు వస్తున్నాడు అని తెలుసుకొని వల్ల ఇంట్లో వెన్న, పాలను ఉట్టి కట్టి పైన పెటింది. ఇంతలో కృష్ణుడు తన స్నేహితులని తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. వచ్చి చూసేసరికి కుండ ఉట్టిమీద ఉంటుంది. ఆ కుండని అందుకోవటం కోసం పీటలు, రోళ్ళు వేసిన అందలేదు. అందుకని కృష్ణుడు ఇదిఅంతా ఎందుకు కుండకి కన్నం పెడితే సరిపోతుంది అని కుండకి కన్నం పెడతాడు కుండ కిందనుంచి కారిపోతుంది. కృష్ణుడు తన స్నేహితులతోకలిసి వెన్న, పాలను తాగేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం యశోదమ్మకి గోపకాంత చేపి బాధపడుతుంది. ఇంకో గోపకాంత కృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలని వెన్న కుండను తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి తలుపు వెనకాల దాకుంటుంది. కృష్ణుడు రానేవచ్చాడు. ఎవరో ఈ ఇంట్లోవాలె గుమ్మం దగ్గర పెట్టారు అని తన స్నేహితులని పిలిచి వాళ్లకి పెట్టి తాను తిందామని తీసుకోగానే ఆ గోపకాంత వచ్చి చెయ్యి పట్టుకుంది.  కృష్ణుడు భయపడకుండా చూస్తున్నాడు. ఆ గోపకాంత కృష్ణుడిని "నువ్వు ఎవరూ పిల్లాడా!" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నేను బలరాముని తముడిని" అని చెపుతాడు. దానికి గోపకాంత ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నువ్వు ఉండవమ్మా! మా దూడ ఒకటి కనపడటం లేదు వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. నువ్వు అరిస్తే పారిపోతుంది" అన్నాడు. దానికి గోపకాంత ఆశ్చర్యపోతు ఏమిటి దూడ కనిపించటం లేదా వెన్న కుండలో ఉందా అని తెల్లబోయి ఆమె చెయ్యి వదిలేసింది కృష్ణుడు పారిపోయాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...