ఉంటే దుర్వాసమహామునిలా ఉండాలి అన్నారు!

 ఉంటే దుర్వాసమహామునిలా ఉండాలి అన్నారు!



ఇది దేవి భాగవతంలోని కథ. ఒకసారి దుర్వాసమహాముని లలితాత్రిపురసుందరి అమ్మవారిని చూడాలని తపస్సు ప్రారంభించారు. కొంతకాలం తరువాత అతని తపస్సుకి మెచ్చిన అమ్మవారు దుర్వాసమహామునిని పరీక్షించాలి అనుకుంది. ముందుగా వరుణ దేవుడిని పంపించింది. వరుణదేవుడు దుర్వాసమహాముని దగరకు వచ్చు మీ తపస్సుకి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో మన్నారు. అందుకు దుర్వాసమహాముని స్వామి నేను మీ కోసం తపస్సు చేయటం లేదు నేను లలిత పరమేశ్వరి అమ్మవారిని చూడాలి అనుకుంటున్నాను అన్నారు. వరుణ దేవుడు వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళి తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి ఇంద్రదేవుడిని పంపించింది. దుర్వాసమహాముని దగరకు వచ్చి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు దుర్వాసమహాముని నీకు ఏమి వరం వద్దు నేను అమ్మవారి కోసం తపస్సు చేస్తున్నాను అని అన్నారు. ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి బ్రహ్మదేవుడిని అయన వద్దకు పంపించింది. బ్రహ్మ దేవుడు దుర్వాసమహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.  అందుకు దుర్వాసమహాముని నన్ను క్షమించండి బ్రహ్మదేవా నాకు ఏమి వరం వద్దు. నేను అమ్మలగన్న అమ్మ కోసం తపస్సు చేస్తున్నాను. బ్రహ్మదేవుడు సరే అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి అమ్మవారు శ్రీమహావిష్ణువుని దుర్వాసమహామునిని పరీక్షించామని పంపించారు. శ్రీమహావిష్ణువు దుర్వాసమహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస! నీ కఠోర తపస్సుకి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.  నీవు ఏమి అడిగిన అని నేను నీకు ప్రసాదిస్తాను కోరుకో అన్నారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రత్యక్షమయే సరికి దుర్వాసమహాముని ఏడుస్తూ నా జన్మ తరించింది స్వామి మీ దర్శన భాగ్యంతో కానీ నన్ను క్షమించండి స్వామి నాకు ఏమి వరం వద్దు. అమ్మ కావాలి అని చెప్పారు.  అందుకు శ్రీమహావిష్ణువు నీ తపస్సు కఠోరమైనది దుర్వాసా నీ అభిష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను. తధాస్తు అని వెళ్లిపోయారు. దుర్వాసమహాముని సంతోషించి మళ్ళీ తపస్సుని ప్రారంభించారు. మరికొంతకాలానికి దేవాధిదేవుడైన మహాదేవుడి శివుడు దుర్వాసుడిని పరీక్షించటానికి వచ్చారు. దుర్వాసా నీ తపస్సుకి వెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకొమ్మరు. సాక్షాత్తు దేవాధిదేవుడైన మహాదేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తాను అనేసరికి దుర్వాసమహామునికి చాల సంతోషం వేసింది. అయన పాదాలపై పడి స్వామి దయకు పాత్రుడిని అయినందుకు సంతోషంగా ఉంది. కానీ నాకు అమ్మ మాత్రమే కావాలి స్వామి అన్నారు. మహాదేవుడు అతనిని ఎన్నివిధాలా సమాధాన పరచిన అతను అమ్మ మాత్రమే కావాలి అన్నారు. మహాదేవుడైన శివుడు నీ అభిష్టం నెరవేరాలి అని ఆశీర్వధిసున్నాను అని వెళ్లిపోయారు. దుర్వాసమహాముని పట్టు వేదలకుండా అమ్మవారి గురించి తపస్సు చేసారు. అలా పదివేల సంవత్సరాలు జరిగాయి. లలిత మరమేశ్వరి అమ్మవారు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైయేది. దుర్వాస! నీ తపస్సుకి మెచ్చాను.  ఇకనుంచి నువ్వు ఎపుడు కావాలి అంటే అపుడు మణిద్విపానికి రావచ్చు నన్ను దర్శనం చేసుకోవచ్చు. నన్ను సేవించుకోవచ్చు. మా మాటలు విని దుర్వాసుడు పరమానంద భరితుడు అవుతాడు. అమ్మ నా జన్మ ధన్యమైనది. నేను చూడటం కోసం తాపత్రయ పడను. చివరికి నా తపస్సు ఫలించింది అని అమ్మవారిని పరిపరి విధాలా కీర్తించారు.  అమ్మవారు దుర్వాసమహామునిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అలా దుర్వాసమహాముని లాగా ఉండాలి అన్నారు. అయన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించేవరకు వదిలిపెట్టలేదు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చిన వదిలి పెట్టి కేవలం తన లక్ష్యం కోసమే పాటుపడ్డారు. 


ఓం శ్రీమాత్రే నమః 

భగవద్గీతలోని ముఖ్య విషయములు

 భగవద్గీత ఆవిర్భావం 

భగవద్గీత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భోదించారు. కౌరవులు రాజ్యాధికారం కోసం యుద్ధనికి సిద్ధమయ్యారు. పాండవమధ్యముడు, వీరుడు అయినా అర్జునుడు అయన రధసారధి పరమాత్మ అయినా శ్రీకృష్ణుడు ఉన్నారు. ఇరువైపులా యుద్ధవీరులు శంఖాలను పూరించారు. యుద్ధరంగములో ఉన్న తన బంధుమిత్రులను చూసి అర్జునుడు దుఃఖంతో నిరసించి ఈ యుద్ధం వల్లనా తనకు ఎలాంటి లాభం లేదుగాని నేను యుద్ధం చేయను అని శ్రీకృష్ణునితో చెపుతారు. శ్రీకృష్ణుడు ఆయనకు కర్తవ్యం బోధించటానికి భగవద్గీత బోధిస్తారు. 

భగవద్గీత విశిష్టత 

భగవద్గీత సమస్త వేదముల సారము. ఉపనిషత్తుల సారము. భగవద్గీతను అధ్యయనము చేయటము వలన కర్తవ్య విముఖులైన మానవులు మళ్ళి కర్తవ్యమును చేరుతారు. ఓటమినుంచి గెలుపు వైపుకు నడిపిస్తుంది. భగవద్గీతలో కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగముల సారాంశాలు ఉన్నాయి. భగవంతుని తత్వము ఆత్మస్వారూపము ఇందులో ప్రధానంగా వివరించపడాయి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు"జ్ఞాన షట్కము" అని అంటారు.




1. అర్జునా విషాదయోగము 

2. సాంఖ్య యోగము

3. కర్మ యోగము

4. జ్ఞాన యోగము

5. కర్మసన్యాస యోగము

6. ఆత్మసంయమ యోగము

7. జ్ఞానవిజ్ఞాన యోగము

8. అక్షరపరబ్రహ్మ యోగము

9. రాజవిద్యారాజగుహ్య యోగము

10. విభూతి యోగము

11.విశ్వరూప దర్శన యోగము

12. భక్తి యోగము

13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

14. గుణత్రయవిభాగ యోగము

15. పురుషోత్తమప్రాప్తి యోగము

16. దైవాసురసంపద్విభాగ యోగము

17. శ్రద్దాత్రయవిభాగ యోగము

18. మోక్షసన్యాస యోగము

   


భగవద్గీత

 అద్యాయం 6

శ్లోకం 46

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిబ్యోపి మతోధికః|

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున||

అర్థం :-

యోగి తాపసులా కంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానులకంటే శ్రేష్ఠుడు. సకామకర్మలను ఆచరించువారి కంటే శ్రేష్ఠుడు అని భావించబడుతుంది. కావునా, ఓ అర్జునా! నీవు కూడా యోగివి కమ్ము.   



హయగ్రీవ స్వామి అవతార కథ

      హయగ్రీవ స్వామి అవతార కథ                                                 

         పూర్వం గుర్రపు తల ఉన్న ఒక రాక్షసుడు ఆదిపరాశక్తి గురించి గోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమైంది. హయగ్రీవా నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. హయగ్రీవుడు నాకు చావు లేకుండా వరం కావాలి అని అడుగుతాడు. దానికి అమ్మవారు ఈ సృష్టిలో చావులేని వరం ఇవ్వటం కుదరదు అని చెపింది అమ్మ. అందుకు హయగ్రీవుడు అయితే నాకు నా ముఖము గల అతని చేతిలోనే నాకు మరణం రావాలి కోరుకున్నాడు. అమ్మవారు తధాస్తు అని వెళ్లిపోయేది. 

        ఆ వరగర్వంతో పాతాలని, భూలోకాని జయించాడు. చివరకు స్వర్గలోకం మీదకు దండెత్తి వచ్చాడు. దేవతలు అతనితో తలపడలేక బ్రహ్మదేవుని దగరకు వెళ్లరు. బ్రహ్మదేవుడు వారిని తీసుకొని వైకుంఠానికి వెళ్లరు. విష్ణుమూర్తి వారికీ అభయమిచ్చి దేవతలతో కలిసి స్వర్గానికి వచ్చి హయగ్రీవునితో యుద్ధం చేసారు. ఈ యుద్ధం 10 ,౦౦౦ సంవత్సరాలు యుద్ధం జరిగింది. అమ్మవారు వరప్రభావం వాళ్ళ విష్ణుమూర్తి కూడా అతనిని ఓడించలేక పోయారు. ఈలోపు విష్ణుమూర్తి అలసిపోయే ఎవరికీ చెప్పకుండా విశ్రాంతి తీసుకోవటానికి వెళ్లిపోయారు. ఒకచోట పద్మాసనం వేసుకొని విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నారు. కాని స్వామి తల ఊగుతుంటే తన తలను నిలబెట్టటానికి అయన ధనస్సునే వొంచి అల్లెతాడుని లాగి కటి దాని కోన గడం కింద పెట్టుకొని విశ్రాంతి తీసుకున్నారు. 



          ఇంతలో దేవతలు విష్ణుమూర్తి అక్కడ యుద్ధంలో లేరు అని తెలుసుకొని ఆయనను వెతకటానికి బ్రహ్మదేవునితో కలిసి వైకుంఠానికి వెలారు. అక్కడ స్వామి లేకపోవటంతో స్వామిని క్షిరసాగర ప్రాంతం వెతకసాగారు. ఒకచోట విష్ణుమూర్తి పద్మాసనం వేసుకొని ధనుస్సుని గడం కింద పెట్టుకొని ధ్యాన ముద్రలో ఉన్న స్వామి కనిపించరు. దేవతలు, బ్రహ్మ దేవుడు సంతోషించి స్వామిని ఎవరు నిద్ర లేపాలి అని అనుకొన్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు నేను ఆపని చేయలేను అని శివుడిని వేడుకున్నారు. శివుడు నేను కూడా ఆ పని చేయలేను అన్నారు. ఇక బ్రహ్మ దేవుడు ఒక ఆలోచన చేసి నేను ఒక పురుగును సృష్టిస్తాను. అని వంగ్రా(చెద) అనే పురుగుని సృష్టించి దానికి శ్రీమహా విష్ణువు అల్లే తాడును కొరకమని ఆదేశించారు. అల్లే తాడు కొరకడం వల్ల ధనుస్సు కదిలి స్వామికి మెలకువ వస్తుంది అని ఆ పురుగుకి ఆజ్ఞాపించారు. అందుకు ఆ పురుగు నేను ఈ పాపం చేయలేను అంటుంది. బ్రహ్మదేవుడు అపుడు ఏది క్షారసాగరం దగర పుట్టటం వల్ల దీనికి వేదజ్ఞానం వచ్చింది. అనుకోని ఈ పని చేస్తే నీకు ఏమి వరం కావాలో ఇస్తాను అన్నారు. అందుకు ఆ పురుగుకు బ్రహ్మదేవుడు నీకు యజ్ఞం లో వేసే నేతి హవిసు వేసేటపుడు నేలమీద పడ నేయి నీకె అని వరం ఇస్తారు. దానికి ఆ పురుగు నాకు ఆ వరం చాలదు అంటుంది. దానికి బ్రహ్మదేవుడు నెల మీద పడ ద్రవ పదార్ధం నీకె, ఎవరైనా పురాణం పుస్తకములు చెదవకుండా దాచిన ఆ పుస్తకాలూ నీకె అని వరం ఇస్తారు. ఆ పురుగు సంతోషించి వేలి అల్లే తాడు కొరకగానే విపరీతమైన శబ్దం వచ్చి శ్రీమహావిష్ణువు నిద్ర లేవకపోగా అయన తల తెగి ఎగిరి సముద్రంలో పడింది. దేవతలు కంగారుగా పడిపోయి సముద్రంలో ఎంత వెతికిన కనిపించదు. అనుకోని ఈ సంఘటన వల్ల ఎవరికీ ఏమి చేయాలో అర్ధం కాలేదు. అందరికి ఆ ఆదిపరాశక్తిని ప్రార్ధిదామని అనుకొన్న శక్తీ సరిపోలేదు. అపుడు బ్రహ్మదేవుడు తన దగర ఉన్న నాలుగు వేదములు రూపం ధరించి బయటకు వచ్చాయి. అవి ఆ ఆదిపరాశక్తిని ప్రదించాయి. అపుడు అమ్మవారు అనుగ్రహించి ఆకాశవాణి రూపములో తన వాక్కుతో ఉత్తర దిక్కున నిద్రిస్తున్న గుర్రపు తలను తీసుకువచ్చి అతికించామని చెపింది. బ్రహ్మదేవుడు ఏడుస్తూ ఎలా ఎందుకు జరిగింది అమ్మ అని అడుగుతారు.        

            దానిని అమ్మవారు హయగ్రీవుడు అనే రాక్షసుడు నా గురించి తపస్సు చేసి తనలాగే ఉన్న అతని చేతిలోనే మరణించాలి అని కోరుకున్నాడు. ఇంకొకటి ఒకసారి లక్ష్మిదేవి, విష్ణుమూర్తి ఏకాంతంగా ఉన్న సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసి నవ్వుతారు. ఈ కారణం లేకుండా తనని చూసి నవ్వుతున్న విష్ణుమూర్తిని చూసి తట్టుకోలేక ఒకరోజు ని తల తెగిపడుతుంది అని శపిస్తుంది. కొంత సేపటి తరువాత తాను చేసిన పనికి బాధపడుతుంది. శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి నువ్వు ఇచ్చిన శాపం కూడా లోకకల్యాణానికే ఉపయోగపడుతుంది అని అభయమిస్తారు  అని అమ్మవారు చెపుతుంది.

              బ్రహ్మదేవుడు అమ్మవారికి నమస్కరించి దేవతలను పంపించి గుర్రపు తలను తెమ్మని పంపిస్తారు. దేవతలు గుర్రం తలని తీసుకువచ్చి విష్ణుమూర్తికి అతికిస్తారు. విష్ణుమూర్తి మళ్ళి లేచి నుంచి మళ్ళి యుద్ధనికి బయలుదేరుతారు. ఆ యుద్ధంలో హయగ్రీవుడిని చంపుతారు శ్రీమహావిష్ణువు. హయగ్రీవుడిని చంపారు కాబట్టి గుర్రపుతల కలిగిన స్వామి కాబట్టి హయగ్రీవా స్వామి అని దేవతలందరు కీర్తించారు. తరువాత విష్ణుమూర్తి తన నిజ స్వరూపాన్ని ధరించి అంశా రూపమున హయగ్రీవస్వామి ఉండిపోయారు. తరువాత విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయారు. హయగ్రీవా స్వామి హిమాలయాలకు వెళ్లి అమ్మవారు గురించి గోరతపస్సు చేసి అమ్మవారు రహస్యనామలు అయినా లలిత సహస్ర నామావళి రచించారు. కొంతకలం తరువాత అగస్యమహర్షికి, లోపాముద్రకి ఉపదేశించారు. వారు భూలోకములో ప్రచారం చేసారు.   


భగవద్గీత

అద్యాయం 6

శ్లోకం 45

ప్రయత్నాద్యతమానస్తు యోగీసంసిద్ధకిల్బిషః |

అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్||

అర్థం:-

కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధనచేయుయోగి అనేకజన్మల సంస్కారమున ప్రభవమున ఈజన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమ పదమును పొందును.     



శ్రీ కృష్ణుడి అష్ట వివాహల వెనక ఉన్న రహస్యం

పరమాత్ముడు అయినా శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలను ఎత్తారు. వాటిలో శ్రీ కృష్ణ అవతారం ఒకటి. శ్రీ కృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని మరియు పదహారు వేలమంది రాజకుమారిలను వివాహం చేసుకున్నాడు. వారిలో ముఖ్యంగా ఎనిమిదిమందిని చెప్పుకుంటారు. అవతారపురుషుడైన శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకోవటానికి గల కారణాలు ఏమిటి? వాటి వివరములు.




రుక్మిణి 

విదర్భరాజు బీష్మకుని కుమార్తె రుక్మిణి. ఆమెకు ఐదుగురు సోదరులు. వారు రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మణీయత. అత్యంత సౌందర్య రాశి రుక్మిణి. ఆమె శ్రీమహాలక్ష్మి అవతారం. ఆమె చిన్న వయస్సు నుంచే శ్రీమహావిష్ణువునే ధ్యానించేది. యుక్తవయస్సు రాగానే శ్రీకృష్ణుని అందచందాలను, పరాక్రమాన్ని గురించి తెలుసుకొని అతనినే వివాహం చేసుకోవాలని శ్రీకృష్ణుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్నా రుక్మిణి సోదరుడు రుక్మి రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయంచించుకున్నాడు. రుక్మిణి ఎంత వారించినా వినలేదు. రుక్మిణి అగ్ని జోధకుడు అనే పండితుడి ద్వారా శ్రీకృష్ణునికి తనకు ఈ వివాహం ఇష్టం లేదు అని నేను మిమ్మలిని నా భర్తగా భావించాను అని వచ్చి నన్ను వివాహం చేసుకోవాలని సందేశం పంపింది. శ్రీకృష్ణుడు ఆమె సందేశాన్ని అందుకొని ఊరిచివర ఉన్న అమ్మవారి గుడిలో వేచి ఉండమని తనను తీసుకువెళతాను అని చేపి పంపించారు. రుక్మిణి ఆ సందేశాన్ని విని తాను ఆ అమ్మవారి గుడిలో వేచి ఉండగా శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను తీసుకు వెళ్లరు. ఈ విషయం తెలుసుకున్న రుక్మి, శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీదకి యుద్ధనికి వెళతారు. బలరాముడు తనకు తెలియకుండా శ్రీకృష్ణుడు విదర్భకు వలదు అని తెలుసుకొని అయన కొంతమందిని సేనను తీసుకొని వెళ్లి శ్రీకృష్ణుడికి సహాయం చేస్తారు. యుద్ధంలో రుక్మి ఓడిపోతాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రముతో అతనిని వదిద్దాము అనుకునే సమయానికి రుక్మిణీదేవి అడ్డుపడుతుంది. తన సోదరుడిని చంపవద్దుఅని ప్రాధేయపడుతుంది. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి అతనికి సగం జుట్టును తీసివేస్తారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకొని ద్వారకకు వచ్చి వారి పెద్దల సమక్షమంలో వివాహం చేసుకుంటారు. అలా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది.


సత్యభామ


శ్రీకృష్ణుని రాజ్యములో ఉన్న సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యభగవానుడిని గురించి తపస్సు చేసి సమంతకమణిని వరంగా పొందుతాడు. ఆ మణి ప్రతిరోజు బంగారాన్ని ఇస్తుంది. ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేతుడు శమంతకమణిని తీసుకొని అడవిలోకి వేటకి వెళతాడు. మళ్ళీ తిరిగి రాడు. ఈ విషయం తెలియని సత్రాజిత్తు మణిని శ్రీకృష్ణుడే తీసాడు అని శ్రీకృష్ణుడి పై నీలాపనిందలు వేస్తాడు. ఆ నీలాపనిందలు తొలగించుకోవటానికి శ్రీకృష్ణుడు కొంతమంది సేనను అడవికి వెళతాడు. అక్కడ కొంతదూరం వెళాకా ప్రసేతుని మృతదేహం కనిపిస్తుంది. ఒక పులి అతనిని చంపేస్తుంది. అతని మృతదేహాన్ని సేనలకు ఇచ్చి సత్రాజిత్తు దగరకు పంపిస్తాడు. శ్రీకృష్ణుడు మణిని వెతుకుంటూ ముందుకు వెళతారు. కొంతదూరం వెళాకా పులి ఒక బలుకముతో పోరాడి మరణిస్తుంది. ఆ బలుకము పులిదగర ఉన్న మణిని తీసుకు వెళుతుంది. శ్రీ కృష్ణుడు అక్కడి నుంచి బలుకమును వెతుకుంటూ ఒక గృహ దగరకు వెళతారు. సేనలను బయటే ఉండమని చేపి శ్రీకృష్ణుడు లోపలి వెళతారు. అక్కడ ఒక పాపా ఆ మణితో ఆడుకుంటుంది. అది తీసుకోవటానికి ప్రయతించిన శ్రీకృష్ణుడిని బలుకము అడగిస్తుంది. ఆ బలుకముతో శ్రీకృష్ణుడు 28 రోజులు యుద్ధం చేస్తారు. చివరకు బలుకము ఓడిపోయి శ్రీకృష్ణుడిని స్వామి శరణు వేడి నేను జాంబవంతుడిని తమరు ఎవరు అని ప్రార్థిస్తుంది. అందుకు శ్రీకృష్ణుడు నేను శ్రీకృష్ణుడిని నీవు నేను రామావతారంలో ఉన్నపుడు రామరావణ యుద్ధం తరువాత ఒకరోజు నీకు ఏమికావాలి అని అడిగాను అపుడు నువ్వు మీతో యుద్ధం చేయాలని ఉంది అని కోరావు. ఆ వరమే ఎపుడు నెరవేర్చను. జాంబవంతుడు సంతోషించి తన పుత్రికను, సమంతకమణిని ఇస్తాడు. శ్రీకృష్ణుడు రాజ్యానికి తిరిగి వచ్చి సత్రాజిత్తుకు మణిని తిరిగి ఇస్తారు. తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం చేస్తాడు. సత్యభామ భూమాత అంశా. సత్యభామ శ్రీకృష్ణుల వివాహం పెద్దల సమక్షంలో జరుగుతుంది.

జాంబవతి 


జాంబవంతుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన కన్య జాంబవతి. ఆమె గత జన్మలో చంద్రుని కుమార్తె. చిన్నప్పటి నుంచి శ్రీహరి గురించి తెలుసుకొని అయన కధలను వింటూ అయనను భర్తగా పొందాలని మనస్సులో ధ్యానించింది . ఒకసారి చంద్రుడు తిర్థయాత్రలు చేస్తూ శేషాచలంలోని ప్రతి తీర్ధాన్ని దర్శిస్తూ అక్కడి స్థలపురాణాలు వింటూ నరసింహ తీర్ధం చేరుకొని ప్రహ్లాదుడికి లభించిన స్వామి అనుగ్రహం గురించి పులకించి పోతూవుండగా శ్రీహరి ప్రత్యక్షమవుతారు. స్వామిని చుసిన జాంబవతి తనని భార్యగా చేసుకోమని ప్రాధిస్తుంది. అందుకు శ్రీహరి ఆమెకు  వెంకటేశమంత్రని ఉపదేశించి నీవు ఇక్కడే తపస్సు చేయి నీ కోరిక నెరవేరుతుంది అని చెపుతారు. మిగిలిన తీర్ధాలన్నిటిని ధర్శించుకొని చివరకు ఋషి తీర్ధం చేరుకొని అక్కడే తపస్సు చేసి యోగవిద్య ద్వారా తన శరీరాన్ని త్యజించి జాంబవంతుని ఇంటిలో జన్మిస్తుంది. ఆ కన్యనే జాంబవంతుడు శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని కూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.     


మిత్రవింద

శ్రీకృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వారిలో సుమిత్రాదేవి అవంతిపురపురాజు జయసేనుని భార్య వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె పేరు మిత్రవింద. కుమారులు మింద, రువింద. మిత్రవింద శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సోదరులు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడిని తప్ప అందరిని ఆహ్వానిస్తారు. వారికీ శ్రీకృష్ణుడు అంటే ద్వేషం. అందుకు మిత్రవింద సోదరులకు తెలియకుండా శ్రీకృష్ణుడికి స్వయంవరానికి ఆహ్వానిస్తుంది. శ్రీకృష్ణుడు ఆమె ఆహ్వానాన్ని మనించి స్వయంవరానికి వస్తారు. మిత్రవింద శ్రీకృష్ణుడిని వరిస్తుంది. మిత్రవింద గతజన్మలో శ్రీమహావిష్ణువుని భర్తగా పొందటానికి ఆయనను ఆరాధించింది. నవవిధభక్తిలో శ్రవణాన్ని ఎంచుకొని శ్రీహరి కధలను వింటూ ఆయనకోసం తపిస్తూ మరణిస్తుంది. శ్రీకృష్ణుడు మిత్రవిందను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.    

    


భద్ర 

శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తలలో ఒకరు శ్రుతకీర్తి. ఈమె కైకేయ దేశపు రాజునూ వివాహం చేసుకుంటుంది. వీరి కుమార్తె భద్ర. ఈమె పుట్టుకతోనే సర్వ లక్షణ సమన్వితురాలు. భద్ర పూర్వజన్మలో సామాన్యడైన మానవుడి ఇంటిలో జన్మిస్తుంది. ఆమె పుట్టుకతోనే జ్ఞాన సంపన్నురాలు. ఆమె పుటిన నాటినుండి జపతపయజ్ఞయాగఉపవాసాలతో గడిపింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం చేయాలని చూస్తారు. భద్ర దానిని తిరస్కరిస్తూ నేను జీవితాంతం శ్రీ హరి ధ్యానంలోనే గడుపుతాను. అడవికి వెళ్లిపోతుంది. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణుడికి మరదలిగా జన్మిస్తుంది. పెద్దల సమక్షంలో భద్ర శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. 


నీల 

ఈమె కుంభకుడి ఇంట్లో జన్మించింది. ఈమెకు యుక్త వయస్సుకు రాగా ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించాడు. అతని రాజ్యములో ఏడూ ఋషభలు అల్లకల్లోలం సృష్టించాయి. వాటిని అదుపులోకి తెచ్చిన వారికీ తన కుమార్తె నీలను ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు. శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుంటారు. ఇంతలో నీలను కొంతమంతామంది రాజులూ అపహరిస్తారు. శ్రీకృష్ణుడు వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. నీల పూర్వజన్మలో అగ్నిదేవుని అంశా అయినా కన్యభాహు కుమార్తె. ఈమె చిన్ననాటి నుంచే శ్రీహరిని పూజించేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే తండ్రి వివాహం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకు నీల సున్నితంగా తిరస్కరించి శేషాచలం పర్వతాల దగరకు వెళ్లి శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. తండ్రి చేసేది లేక ఆమెకు రక్షణ కల్పిస్తాడు. ఆమె తీర్వ తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఆమె తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అందుకు శ్రీహరి కృష్ణ అవతారంలో నీ కోరిక నెరవేరుతుంది అని అభయమిస్తారు. నీల శ్రీకృష్ణుల వివాహం పెద్దల సమక్షంలో జరుగుతుంది. 


కాలింది 
ఈమెనే యమునా అనికూడా పిలుస్తారు. సూర్యుని అంశా అయినా వివశవంత కుమార్తె కాలింది. ఈమె శ్రీహరిని భర్తగా పొందటానికి పాపానుతాపమనే విశిష్టి తపస్సుని యమునా నది ఒడ్డున ఆచరించింది. ఒకరోజు శ్రీకృష్ణార్జునులు అటువైపుగా వచ్చారు. ఆమెను చుసిన శ్రీకృష్ణుడు వివరాలు కనుకోమని ఆమె దగరకు అర్జునుడిని పంపిస్తారు. ఆమెను గురించి తెలుసుకున్న అర్జునుడు అరికృష్ణుడికి చేపి ఇద్దరికి సంధి కుదిర్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తారు.

లక్షణ 
మధురదేశానికీ రాజు అయినా బృహసేనుడి కుమార్త లక్షణ. స్వయంవరంలో మత్స్య యంత్రం చేధించిన వారికీ తన కుమార్తను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు. లక్షణ పూర్వజన్మలో అగ్నిదేవుని పుత్రిక. ఆమె పూర్ణపురుషుడు శ్రీహరి మాత్రమే అని భావించి ఆయనను భర్తగా పొందాలని తపించి ప్రాణత్యాగం చేస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి లక్షణను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు. 

భగవద్గీత

అద్యాయం 6

శ్లోకం 44

పూర్వాభ్యాసేవ తేనైవ హ్రియతే హ్యవశో పి సః |

జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||








అర్థం :-

శ్రీ మంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావము నిస్సందేహముగ భగవంతునివైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధిరూపయోగజిజ్ఞాసువుగూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అధిగమించును. 


రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...