భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 17

కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః|

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో కర్మణో గతిః||

అర్ధం :-

'కర్మ' తత్తమును తత్తమును తెలిసికొనవలెను,  అట్లే 'అకర్మ' స్వరూపమును గూడ ఎరుగవలెను,  ' వికర్మ' లక్షణములనుకూడా తెలిసికొనుట చాల అవసరము.  ఏలనన,  కర్మ తత్త్వము అతినిగూఢమైనది. 

తిరుప్పావై

పాశురము 17

    అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్

    ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్

    కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే

    ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్

    అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద

    ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్

    శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా

    ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

అర్ధం :-

ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 16

కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః|

తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞత్వా జ్ఞత్వామోక్ష్యసే శుభాత్||

అర్ధం :-

కర్మ అనగా నేమి? అకర్మ అనగా నేమి? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపదుతున్నారు. కనుకా, కర్మతత్త్వమును నీకు చక్కగా వివరిస్తాను. దానిని తెలుసుకొని నీవు ఆశుభముల నుండి అనగా కర్మబంధములనుండి ముక్తుడవవుతవు. 

తిరుప్పావై

పాశురము 16

    నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

అర్ధం :-

తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.




భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 15

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|

కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రాచినులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మల నాచరించారు.  కావున,  నీవును ఆ పూర్వులవలేనే నిష్కామ భవముతో కర్మలనాచరించు. 

తిరుప్పావై

పాశురము 15

 ఎల్లే ఇళజ్గిళియే ఇన్నముఱజ్గదియో

శిల్లెన్ఱళై యేన్మిన్ నజ్గైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై యున్ కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్
వల్లీర్ కళ్ నీజ్గశే, నానేదానాయిడుగ
ఒల్లై నీపోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్
వల్లానైకోన్ఱానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై ,మాయనైప్పాడేలో రెమ్బావాయ్.

అర్ధం :-
ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది - 
బయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! 
లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను. 
బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా! 
లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే!
బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ!
లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్ధులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా?
బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్కజూడవచ్చు కదా!
లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు?
బయటివారు - కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు' అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్ఠిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.


భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 14

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ|

ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే||

అర్ధం :-

నాకు కర్మఫలాసక్తి లేదు. కావున, కర్మలు నన్నంటవు. ఈ విధముగా నాతత్త్వమును తెలిసినవారు కర్మబద్ధులు కారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...