స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి అష్టోత్తర శత నామావళి




 ఓం దుర్గాయై నమ:

ఓం శివాయై నమ:

ఓం  మహాలక్ష్మ్యై నమ:

ఓం మహా గౌర్యై నమ:

ఓం  చండికాయై నమ:

ఓం సర్వజ్జాయై నమ:

ఓం  సర్వలోకోశ్యై నమ:

ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:

ఓం  సర్వ తీర్థమయాయై నమ:

ఓం  పుణ్యాయైనమ:(10)

ఓం  దేవయోనయే నమ:

ఓం అయోనిజాయై నమ:

ఓం భూమిజాయై నమ:

ఓం నిర్గుణాయై నమ:

ఓం ఆధార శక్త్యై నమ:

ఓం  అనీశ్వర్యై నమ:

ఓం నిర్గుణాయై నమ:

ఓం  నిరహంకారాయై నమ:

ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:

ఓం సర్వలోక ప్రియాయై నమ: (20)

ఓం  వాణ్యై నమ:

ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:

ఓం పార్వత్యై నమ:

ఓం దేవమాత్రే నమ:

ఓం  వనీశ్యై నమ:

ఓం వింద్య వాసిన్యై నమ:

ఓం తేజోవత్యై నమ:

ఓం మాహా మాత్రే నమ:

ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:

ఓం దేవతాయై నమ: (30)

ఓం వహ్ని రూపాయై నమ:

ఓం సతేజసే నమ:

ఓం వర్ణ రూపిణ్యై నమ:

ఓం గణాశ్రయాయై నమ:

ఓం గుణమద్యాయై నమ:

ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:

ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:

ఓం కాంతాయై నమ:

ఓం సర్వ సంహార కారిణ్యై నమ:

ఓం ధర్మజ్జానాయై  నమ: (40)

ఓం ధర్మ నిష్ఠాయై నమ:

ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:

ఓం కామాక్ష్యై నమ:

ఓం  కామ సంహత్ర్యై నమ:

ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:

ఓం శాంకర్యై నమ:

ఓం శాంభవ్యై నమ:

ఓం శాంతాయై నమ:

ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:

ఓం సుజయాయై నమ:(50)

ఓం జయాయై నమ:

ఓం భూమిష్థాయై నమ:

ఓం జాహ్నవ్యై నమ:

ఓం జన పూజితాయై నమ:

ఓం శాస్త్ర్ర్రాయై నమ:

ఓం శాస్త్ర మయాయై నమ:

ఓం నిత్యాయై నమ:

ఓం శుభాయై నమ:

ఓం శుభ ప్రధాయై నమ:

ఓం చంద్రార్ధ మస్తకాయై నమ: (60)

ఓం భారత్యై నమ:

ఓం భ్రామర్యై నమ:

ఓం కల్పాయై నమ:

ఓం కరాళ్యై నమ:

ఓం కృష్ఠ పింగళాయై నమ:

ఓం బ్రాహ్మే నమ:

ఓం నారాయణ్యై నమ:

ఓం రౌద్ర్ర్యై నమ:

ఓం చంద్రామృత పరివృతాయై నమ:

ఓం జేష్ఠాయై నమ: (70)

ఓం ఇందిరాయై నమ:

ఓం మహా మాయాయై నమ:

ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:

ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:

ఓం కామిన్యై నమ:

ఓం కమలాయై నమ:

ఓం కాత్యాయన్యై నమ:

ఓం కలాతీతాయై నమ:

ఓం  కాల సంహార కారిణ్యై నమ:

ఓం యోగ నిష్ఠాయై నమ: (80)

ఓం యోగి గమ్యాయై నమ:

ఓం తపస్విన్యై నమ:

ఓం జ్జాన రూపాయై నమ:

ఓం నిరాకారాయై నమ:

ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:

ఓం భూతాత్మికాయై నమ:

ఓం భూత మాత్రే నమ:

ఓం భూతేశాయై నమ:

ఓం భూత ధారిణ్యై నమ:

ఓం స్వదానారీ మద్యగతాయై నమ: (90)

ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:

ఓం మోహితాయై నమ:

ఓం శుభ్రాయై నమ:

ఓం సూక్ష్మాయై నమ:

ఓం మాత్రాయై నమ:

ఓం  నిరాలసాయై నమ:

ఓం నిమగ్నాయై నమ:

ఓం నీల సంకాశాయై నమ:

ఓం నిత్యానందాయై నమ:

ఓం హరాయై నమ: (100)

ఓం పరాయై నమ:

ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:

ఓం ఆనందాయై నమ:

ఓం సత్యాయై నమ:

ఓం దుర్లభ రూపిణ్యై నమ:

ఓం సరస్వత్యై నమ:

ఓం సర్వ గతాయై నమ:

ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ: (108)

భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 22

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే |

లభతే చ తతః కామన్ మయైవ విహితాన్ హి తాన్ ||

అర్థం :-

అట్టి సకామభక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్పలితముగ నా అనుగ్రహమువలననే ఆ దేవతద్వారా ఆ భోగములను ఆతడు తప్పక పొందగలడు.



భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 21

యో యో యాం తమం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||

అర్థం :-

సకామభక్తుడు ఏయేదేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయాదేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును.



భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 20

కామైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః |

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా వియతాః స్వయా ||

అర్థం :-

నానావిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారిజ్ఞానము హరింపబడును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాదిస్తున్నారు.



         

భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 19

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |

వాసుదేవః సర్వమితి స మహాత్మాసుదుర్లభః ||

అర్థం :-

అనేకజన్మలపిదప జ్ఞానియైనవాడు సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు.



శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 2

శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 2



దేవతలు బ్రహ్మాండము బయటికి వెళ్ళి దాని కొరకు ఒక యజ్ఞము చేయాలని హిమాలయపర్వతముల మీద ఒక  యజ్ఞప్రాంగణము ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. భండుడికి ఎందరో గూఢచారులు ఉన్నారు. వాడు ఎక్కడ ఎవరు ఎలా కదిలినా పసికడతాడు. ఏమి చెయ్యాలని ఆలోచన చేసారు. శ్రీమహావిష్ణువు – ‘భండుడికి ఇతరులు భోగములు అనుభవించకూడదు, తానే అనుభవించాలని కోరిక కనక ఇంతకముందు వాడు కనీ వినీ ఎరుగని ఇద్దరు కాంతలను సృష్టించి వాడి దగ్గరకు పంపి వాడు వారితో రతికేళిలో మునిగి తేలుతూ ఉండగా మనము నిశ్శబ్దముగా ఎవరికీ తెలియకుండా హోమగుండము ఏర్పాటు చేద్దామ’ ని దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మాండము అంచు దగ్గరకు తీసుని వెళ్ళారు. బ్రహ్మాండము బయటకు వెళ్ళి అవతల ఉన్నవారిని ఆహ్వానించాలి. దేవతలు బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి వెళితే బయట ఎన్నో కోట్లబ్రహ్మాండములు ఉన్నాయి. ఎవరిని పిలవాలి? ఎవరు వచ్చి రక్షిస్తారు? పిలిస్తే వచ్చి శక్తిపుట్టేట్టుగా అనుగ్రహించే రుద్రుడిని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా పలుకుతాడని దేవతలు రుద్రుడిని ప్రార్థన చేసారు. దేవతలు చేసిన ప్రార్థన విని రుద్రుడు అక్కడకు వచ్చి మీకు కలిగిన ఆపద తీరాలి అంటే లలితాపరాభట్టారిక ఆవిర్భవించాలి. అందుకొరకు ఒక మహాయజ్ఞము చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు భండుని మోహములో పడవెయ్యడానికి ఇప్పటికే ఇద్దరు కన్యలను సృష్టించారు. నిశ్శబ్దముగా హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి హోమము చేద్దాము అన్నాడు.

పెద్ద యజ్ఞకుండము తయారు చేసారు. అందులో అగ్నిరగిల్చి హవిస్సులు వేసి అమ్మవారిని పిలవాలి. భండుడు తెచ్చిన ఉపద్రవమునకు అగ్నిహోత్రము ప్రతిష్ఠించడానికి ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్నిపనికిరాదు. బ్రహ్మాండమునకు చేసిన రంధ్రమునుంచి చిదగ్ని అనే అగ్నిని వాయురూపములో తీసుకుని వచ్చి ఆ వాయువును అగ్నికుండములో పెట్టి హవిస్సులు ఇవ్వడానికి అగ్ని రగిలిస్తాను. సామాన్యమైన పదార్థములు వేస్తే యజ్ఞముతో ప్రీతి చెందడానికి చాలాకాలం పట్టవచ్చు. భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావము జరిగిపోవాలి. మీ శరీరభాగములను ఖండించి హవిస్సుగా సమర్పించండి. దేవతలు కనక మీ శరీర భాగములను కోసినంత మాత్రమున మీకు మృత్యువు రాదు. ఆర్తి ప్రకటనము జరిగి అమ్మవారు ఆవిర్భవిస్తుంది అన్నాడు రుద్రుడు. ‘అమ్మా ! నువ్వు ఆవిర్భవించాలి’ అని దేవతలందరితో కలిసి రుద్రుడు ప్రార్థన చేసాడు.

దేవతలు తమ శరీరఖండములనుకోసి హోమకుండములో వేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కంటితో చూడడానికి వీలుకాని పరబ్రహ్మస్వరూపిణి, మణిద్వీపములో కూర్చుని అన్ని బ్రహ్మాండములను శాసించకలిగి, కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలయిన అమ్మవారు అనుగ్రహము కలిగి, ఈ బ్రహ్మాండములో హిమాలయ పర్వతముల మీద ఏర్పాటు చేసిన హోమకుండములోని చిదగ్నినుంచి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభము అయింది. అమ్మవారు ఆవిర్భవిస్తున్న స్వరూపమును దేవతలు ప్రార్థన చేసారు. ఆవిర్భవించిన తరవాత ఏమి జరిగిందన్నది లలితాసహస్రనామ పూర్వభాగములో వివరణ ఇచ్చారు. దేవతా సైన్యములను, వారాహిని, శ్యామలాదేవిని, బాలాదేనిని, ఏనుగులను, గుఱ్ఱములను, సృష్టి చేసి, తనభర్తను మహా కామేశ్వరుడిగా స్వీకరించి, ఎలా యుద్ధము చేసింది? భండుని ఎలా చంపింది ? అన్న విషయములు తరవాత భాగములో వస్తాయి. 

శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 1

భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 18

ఊదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||

అర్థం :-

ఈ చతుర్విధభక్తులందరును ఊధారులే. కాని జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలమమ అట్టి భక్తుడు తనమనస్సును, బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థిరముగా ఉన్నాడు.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...