భగవద్గీత
భగవద్గీత
భగవద్గీత
అధ్యాయం 6
శ్లోకం 34
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్|
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్||
అర్దం:-
ఓ కృష్ణ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక, దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనివలె మిక్కిలి దుష్కరమని భావింతును.
భగవద్గీత
అధ్యాయం 6
శ్లోకం 33
అర్జునా ఉవాచ
యోయం యోగస్త్యయా ప్రోక్తః సామ్యేన మదుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||
అర్ధం :-
అర్జునుడు పలికెను :-
ఓ మధుసూదనా! సమభావమును గూర్చి చెప్పిన ఈ యోగముయొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్యకారణమున తెలిసికొనలేకున్నాను.
భగవద్గీత
అధ్యాయం 6
శ్లోకం 32
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యాది వా దుఃఖం స యోగీ పరమో మతః||
అర్ధం :-
ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె(తనతో) సమానముగా చూచువాడును, సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా చూచువాడును(ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమశ్రేష్ఠుడు.
భగవద్గీత
అధ్యాయం 6
శ్లోకం 31
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|
సర్వథా వర్తమానో పి స యోగీ మయి వర్తతే||
అర్ధం :-
భగవంతునియందు ఏకీభావస్థితుడైనపురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానందఘనవాసుదేవుడనైయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథసర్వవ్యవహరములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును.
భగవద్గీత
అధ్యాయం 6
శ్లోకం 30
యో మాం పశ్యతి సర్వత్ర చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి||
అర్ధం :-
సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచుపురుషునకు, అట్లే ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి, నేను అదృశ్యుడను కాను. ఆతడును నాకు అదృశ్యుడు కాడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్...






