భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 6

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|

యోగయుక్తో మునిర్ర్బహ్మ నచిరేణాధిగచ్ఛితి||

అర్ధం :-

ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్న్యాసము  అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములద్వారా జరుగు కర్మలన్నింటీ యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననముచేయు కర్మయోగి పరబ్రహ్మపరమాత్మను శీఘ్రముగా పొందగలడు.

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 5

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏవం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||

అర్ధం :-

జ్ఞనయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞనయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్దమును గ్రహించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 4

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః  ప్రవదంతి న పండితాః |

ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్||

అర్ధం :-

సాంఖ్య,  కర్మయోగములు వేర్వేరుఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ  ఒక్కదానినైనని బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 3

జ్ఞయః నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి|

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే||

అర్ధం :-

మహాబాహూ! ఎవరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎరుంగవలెను. ఏలనన, రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధములనుండి ముక్తుడగును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ

సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|

తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే||

అర్ధం :-

శ్రీ కృష్ణ భగవానుడు పలికెను:- కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరామకల్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోను కర్మసన్న్యాసము కంటెను, కర్మయోగము సుగమమగుట వలన శ్రేష్ఠమైనది. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణ లీలలు 

యశోదమ్మ ఒక రోజు శ్రీకృష్ణుడికి నలుగు పెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్న పట్టు పంచెకట్టి జుత్తుకి చిన్న కొప్పు వేసి ఆ కోప్పుకి తెల్లటి ముత్యాల దండా కట్టి చిన్న నెమలి పించం పెట్టి మేడలో నగలువెసి మూడు నామాల బోటు పెట్టి చేతులకి కడియాలు, కళ్ళకి మువ్వల పటీలు పెట్టి నడుముకి చిన్న కొమ్ముబూర కట్టి తయారు చేసింది. చిన్ని కృష్ణుడు తరువాత అమ్మ దగర నుంచి పాకుతుంటే కొత్తగా పెట్టిన మువ్వల శబ్దానికి భయపడి మళ్ళి అమ్మ వొళ్ళో పొడుకోని అమ్మ ఒంక చుస్తే యశోదమ్మ నవ్వుకొని "నా చిన్ని కన్నయ్య! భయపడదు అవి మువ్వల పటిల్లు నానా అని చెపుతుంది. చిన్ని కృష్ణుడు కూడా ఒక నవ్వు నవ్వుతాడు. 

భగవద్గీత

అథ పంచమో ధ్యయః - కర్మసన్న్యాసయోగః 

అర్జున ఉవాచ 

శ్లోకం 1

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |

యచ్ర్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్||

అర్ధం :-

అర్జునుడు పలికెను :- ఓ కృష్ణ! ఒక్కసారి కర్మసన్న్యాసమును,  మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు.  నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...