భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 56

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

అర్ధం :- 

దుఃఖములకు క్రుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివడు, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి ముని స్థితప్రజ్ఞుడు అనబడును.

భగవద్గీత

అధ్యాయం 2
శ్లోకం 55

శ్రీభగవాన్ ఉవాచ

ప్రజహతి యదా కామాన్ సర్వన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

అర్ధం :- 

శ్రీభగవానుడు పలికెను :- ఓ అర్జునా మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందుసంతుష్టుడైనవానిని, అనగా పరమత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితరగ్ఞుడని యందురు.


భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 54

అర్జున ఉవాచ

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థిస్య కేశవ |

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||

అర్ధం :- 

అర్జునుడు పలికెను :- ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు నడుచును?

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |

సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి ||

అర్ధం :- 

నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా, నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. 

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 52

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

అర్ధం :- 

మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోకసంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 51

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |

జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ||

అర్ధం :- 

అనగా కర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. ఏలనన, సమబుద్ధియుక్తులైన, జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 50

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||

అర్ధం :-       

సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక, నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియో కర్మాచరణమునందు కౌశలము.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...