భగవద్గీత

అథ షష్టో ద్యాయః - ఆత్మసంయమయోగః 

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ 

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |

స సన్న్యాసి చ యోగీ చ ననిరగ్నిర్నచాక్రియః ||

అర్ధం :-

భగవానుడు పలికెను :-

కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కానీ, కేవలము అగ్నికార్యములను త్యజించినంతమాత్రమున సన్న్యాసియుకాదు. 


భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 29

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి ||

ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసన్న్యసయోగోనామ పంచమోధ్యాయః ||5||

అర్ధం :-

భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్తలోకములకును, లోకేశ్వరులకును అధిపతి. సమస్తప్రాణులకును ఆత్మీయుడు. అనగా - అవ్యాజాదయాళువు. పరమప్రేమస్వరూపుడి. ఈ భగవత్తత్త్వమును ఎఱిగిన భక్తునకు పరమ శాంతి లభించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 28

యతేంద్రియమనోభుద్దిః మునిర్మోక్షపరాయణః |

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||

అర్ధం :-

ఈ ప్రక్రియల ప్రభవమున మనస్సు, బుద్ది, ఇంద్రియములు సాదకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాదనవలన మొక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 27

స్పర్శన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రునోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ||

అర్ధం :-

బహ్యవిషయభోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉమ్చవలెను. ణాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపానవాయువులను సమస్థితిలో నడుపవలెను. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 26

కామక్రోధావియుక్తానాం యతీనాంయతచేతసామ్ |

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే ధీతాత్మనామ్ ||

అర్ధం :-

కామక్రోధరహితులును, చిత్తవృత్తులనుజయించినవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంతపరబ్రహ్మపరమాత్మయే గోచరించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 25

లభంతే బ్రహ్మనిర్వణమ్ ఋషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మనః సర్వభూతరహితే రతాః||

అర్ధం :-

పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్తసంశయములనివృత్తిని సాధించినవారును, సర్వప్రాణులహితమును గోరువారును, నిశ్చలస్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నముచేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిర్వణమును పొందుదురు.

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 24

యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః |

స యోగీ బ్రహ్మనిర్వణమ్ బ్రహ్మభూతోధిగఛ్ఛతి||

అర్ధం :-

ఆంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మయందే రమించు  వాడును, ఆత్మజ్ఞనియైనవాడును అగు సాంఖ్యయోగి, సచ్ఛిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై, బ్రహ్మనిర్వణమును పొందును. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...