శైలపుత్రి

     

         అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రిమాత. ఆదిపరాశక్తిని కూతురిగా పొందటానికి హిమవంతుడు, మేనకా తపస్సును చేసారు. ఆదిపరాశక్తి వారి తపస్సుకు మెచ్చి వారికీ కూతురిగా పుడతాను అని వరం ఇచ్చింది. వారి తపస్సు ఫలించినందుకు వారు సంతోషించారు. ఆ మాత రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఒక శుభదినమున మేనకా గర్భవతి అయినది. అప్పటినుండి మేనకా, హిమవంతులు మహర్షులకు సేవ చేస్తూ అమ్మవారి రాక కోసం ఎదురు చుస్తునారు. ఒక  శుభముహుర్తమున మేనకా ప్రసవించింది. అందుకు హిమవంతుడు సంతోషించి మహర్షులకు దానధర్మాలు చేసారు. పర్వతరాజు పుత్రి పార్వతి అని పిలిచారు.  శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతుని కుమార్తె కాబటి శైలపుత్రి అని పిలిచారు. 



        మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు ఆదిపరాశక్తి శైలపుత్రిదేవిగా వచ్చింది. 

         యోగమార్గంలో ఉన్నవారు ఇంకా ఆధ్యామికంగా ఎదగాలి అనుకునేవారు శైలపుత్రిమాతను ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఉన్నత స్థానాలకు చేరవచ్చు అని దేవి భాగవతం,  శివ పురాణం చెపుతున్నాయి. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రిమాత. శైలపుత్రిమాత మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. 

      శైలపుత్రి మాత శివుని కోసం తపస్సు చేసి భర్తగా పొందింది. ఆమె నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకికంగా తండ్రి అయినా హిమవంతుడి నుండి భర్త అయినా శివుని వెతుక్కుంటూ ప్రయాణించింది.

               -: శైలపుత్రి ధ్యానం:-

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరం 

వృషారూఢం శూలధరాం శైలపుత్రీo యశస్వనీమ్

                           -:అర్ధం:-

వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశశ్శు కలిగి భక్తుల మానః వాంఛలను తీర్చే మాత శైలపుత్రీ దుర్గ దేవికి నా వందనం ఆర్పుస్తున్నాను. 

          -:శైలపుత్రీదేవి ఆలయం:-

ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హియ ఘాట్ వద్ద శైలపుత్రీ దేవి ఆలయం ఉంది.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 67

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో ను విషియాతే l

తదస్య హారతి ప్రజ్ఞం వాయుర్నావమివాంభసి ll

అర్ధం :-

మనశాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును? నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్ధముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నాను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజునిబుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 66

నాస్తి  బధిరయుక్తస్య న చాయుక్తస్యభావనా l

న చాభావయతః శాంతి: అశాంతస్య కుతః సుఖమ్ ll

అర్ధం :-

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్థికభావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 65

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే l

ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠితే ll

అర్ధం :-

మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుధ్ది అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 64

రాగద్వేషవియుక్టైస్తు విషయానింద్రియైశ్చరన్ l

ఆత్మవశైర్విదేయాత్మ ప్రసాదమాదిగచ్ఛతి ll

అర్ధం :-

అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ధ్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శoతిని పొందును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 63

క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతివిభ్రమః l

స్మృతిభ్రంశాద్భుద్ధినాశో బుధినాశాత్ ప్రణశ్యతి ll

అర్ధం :-

అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతిభాష్టమైనందున బుధ్ది అనగా జ్ఞానశక్తి నశించును. బుధ్ది నాశమువలన మనుష్యుడు తన స్థితినుంచి పతనమగును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 62

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే l

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే ll

అర్ధం :-

విషయచింతన చేయు పురుషునకు ఆ  విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. 



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...