భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 61

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః l

విశే హి యస్యేoద్రియాణి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ll

అర్ధం :-

కనుక, సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, సమాహితచిత్తుడై మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన, ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుధ్ది స్థిరముగా నుండును.






భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 60

యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః l

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ll

అర్ధం :-

ఓ అర్జునా! ఇంద్రియములు ప్రధానశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 59

విషయా వినివర్తంతే నిరాహారస్య  దేహినః l

రసావర్జo రసోప్యస్య పరం దృష్ట్వా  నివర్తతే ll

అర్ధం :-

ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని, వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 58

యదా సంహరతే చాయ కూర్మోoగానీవ సర్వశః l

ఇంద్రియాణీంద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ll

అర్ధం :-

తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా,  ఇంద్రియములను  ఇంద్రియార్థముల నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.




భగవద్గీత


అధ్యాయం 2
శ్లోకం 57

యః  సర్వత్రానభిస్నేహః తత్తత్  ప్రాప్య శుభాశుభమ్ l 

నాభినందతి న ధ్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా l

అర్ధం :-

దేనియందును  మమతాసక్తులు లేనివాడును, అనుకూల  పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు  ద్వేషము మొదలగు  వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.


క్విజ్ = Quiz

శ్రీ కృష్ణుడు ఎక్కడ జన్మించాడు ?


(1) వ్రేపల్లె              (2) మధుర నగరం 


(3) ద్వారకా నగరం           (4) బృందావనం


కామెంట్ చేయండి

క్విజ్ = Quiz

 శ్రీ కృష్ణుడి వామ పాదం తగిలి మొక్షం పోందిన రాక్షసుడు ఎవరు ?


 (1) శిశుపాలుడు            (2) కంసుడు
 (3)శకటాసురుడు            (4) కాళియుడు

కామెంట్ చేయండి 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...