సంకల్పబలం ఉంటె ఏదైనా సాధిచవచ్చు అని చేపిన కథ

సంకల్పబలం ఉంటె ఏదైనా సాధిచవచ్చు అని చేపిన కథ


 

సముద్రపు వడ్డున ఒక చెట్టు మీద ఒక పక్షి జంట నివసిస్తుంది. ఒక రోజు ఆ పక్షి గుడ్లు పెటింది. మరుసటి రోజు అవి ఆహారం కోసం బయటకు వేలాయి. అవి అటు వెళ్ళగానే సముద్ర జలాలు వచ్చి ఆ పక్షి గూడుని గుడ్లను పడేశాయి. ఆ పక్షులు వచ్చి చూసి విలవిలా దుఃఖించాయి. మళ్ళి కొనాలకి ఆ పక్షి మళ్ళి గుడ్లు పెటింది. మళ్ళి అలాగే సముద్రపు అలలు వచ్చి మళ్ళి పక్షి గూడుని పడేశాయి. ఇలా పదే పదే జరగటం వలన ఆ పక్షి జంటకి సముద్రుడి మీద కోపం వచ్చింది. ఆ పక్షులు మిగిలిన పక్షులతో మేము సముద్రాన్ని పూడుస్తాము అన్నాయి. అందుకు మిగిలిన పక్షులు వీటి మాటలు విని ఎగతాళిగా మీరు ఎంత ఉన్నారు. సముద్రం ఎంతవుంది ఇది సాధ్యమైయే పనేనా అని నవ్వాయి. అవి ఎగతాళి చేసిన వదలకుండా మేము చేస్తాము అని వెళ్లిపోయాయి. ఆ పక్షి జంట సముద్రం లో నీటిలో వాటి రెక్కలను తడుపుకొని సముద్రం వడ్డున ఉన్న ఇసుకలో దొర్లాయి. ఆ తడికి వాటికీ ఇసుక అంటింది. మళ్ళి ఆ ఇసుకని తీసుకొని వెళ్లి సముద్రంలో మునిగాయి. ఇలా కొని సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నాయి. వాటి పట్టుదల చూసి మిగిలిన అన్ని పక్షులు కూడా వీటికి తోడుగా ఇసుకను సముద్రంలో వేయసాగాయి. ఆ జంట పక్షులకి కొన్ని వేళా పక్షులు తోడయ్యాయి. ఈ మాట ఆ నోటా ఈనోటా పక్షి రాజు అయినా గరుత్మంతునికి తెలిసి అయ్యో నా జాతి పక్షులు ఇంత కష్టపడుతున్నాయి. నేను వాళ్లకి సహాయం చేయాలి. అనుకోని పెద్ద పెద్ద బండరాళ్లను, కొండలని తీసుకొచ్చి సముద్రంలో వేయసాగారు గరుత్మంతుడు. ఇలా కోణాలు జరిగింది. ఒకసారి శ్రీమహావిష్ణువు తన వాహనం అయినా గరుత్మంతుడు కనిపించటం లేదు అని చూడగా గరుత్మంతుడు సముద్రంలో పెద్ద పెద్ద కొండలను వేస్తూ కనిపించారు. వెంటనే శ్రీమహావిష్ణువు వైకుంఠము వదిలి గరుత్మంతుడి దగరకు వచ్చి విషయం తెలుసుకొని  ఆ చిన్ని పక్షుల సంకల్ప బలానికి ఆ దేవాధిదేవుడు ముచ్చటపడి స్వామి సముద్రుడిని పిలచి వాటి గుడ్లు వాటికీ ఈపించి ఇంకెప్పుడు వాటి జోలికి రావద్దు అని హెచ్చరించి వెళ్లరు ఆ శ్రీమహా విష్ణువు. సంకల్ప బలం తో ఒకచిన్న పక్షి జంట చేసిన ప్రయత్నం సాక్షాత్తు శ్రీమహా విష్ణువునే కదిలించాయి. 




భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 22

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |

యస్విన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||

అర్ధం :-

బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధిద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాదు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 21

సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రహ్యమతీంద్రియమ్ |

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః |

అర్ధం :-

బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధిధ్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపమునుండి ఏమాత్మమూ విచలితుడు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 20

యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ |

యాత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ||

అర్ధం :-

ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ధ్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని, యోగి ఆ స్చచిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు.  

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 19

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృతా |

యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ||

అర్ధం :-

వాయుప్రసారములేనిచోట నిశ్చలముగానుండు దీపమువలె, యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మధ్యానమున నిమగ్నమైయున్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలముగా నుండును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 18

యదా వినియతం చిత్తమ్ ఆత్మన్యేవావతిష్ఠతే |

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||

అర్ధం :-

చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పినప్పుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. ఆప్పుడతడు యోగయుక్తుడనబడును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 17

యుక్తాహారవిహాస్య యుక్తచేష్టస్య కర్మసు |

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||

అర్ధం :-

ఆహారవిహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...