సాలగ్రామం

సాలగ్రామం - స్వర్ణముఖీ 

సాలగ్రామం సాక్షితు శ్రీ మహా విష్ణువు స్వరూపం. ఈ సాలగ్రామాలు నేపాల్ లో ఉన్న కాట్మండు నగరంలో ఉత్తరణా ఉన్న గండకీ నదిలో ఉన్నాయి అని ప్రతీతి. 

       అసలు ఈసాలగ్రామం ఎలా భూలోకానికి వచ్చాయి.  అవి శ్రీమహా విష్ణువు స్వరూపం ఎలా అయ్యాయి. 

        పూర్వం రాక్షస రాజు అయినా జలంధరుడు కుమారుడు శంఖచూడుడు రాక్షస గురువుఅయిన శుక్రాచార్యుడు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ గురించి 100 సంవత్సరాలు గోరా తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సుకి మెచ్చి అతనికి దర్శనా భాగ్యం కలిగించాడు. ఓ శంఖచూడుడ ని తపస్సుకి మెచ్చాను నీకు ఏమివరం కావాలో కోరుకో అని అన్నారు. అపుడు శంఖచూడుడు ఓ బ్రహ్మదేవా నాకు చావు లేకుండా వరం అనుగ్రహించు అన్నారు. అపుడు బ్రహ్మదేవుడు నాయన ఎవరైనా పుట్టిన తరువాత మరణించక తప్పదు నాతోసహా ఏది లోక నియమం. అపుడు శంఖచూడుడు అయితే స్వామి నాకు రెండు వరాలను అనుగ్రహించు అని అడిగాడు. అడుగు నాయన అన్నారు. నాకు మహా పతివ్రత అయినా భార్య కావాలి. బ్రహ్మ తధాస్తు అన్నారు. నా రెండొవ వరం ఆమె పాతివ్రతగా ఉన్నంతవరకు నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు తధాస్తు అన్నారు. 

            శంఖచూడుడు సంతోషంగా శుక్రాచార్యుడి దగరకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. శుక్రాచార్యుడు సంతోషించి భూలోకములో ధర్మధ్వజుడు అనే రాజు ఉన్నాడు అతనికి బృంద అనే కుమార్తె ఉన్నది. ఆమెను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. శంఖచూడుడు వెళ్లి ధర్మధ్వజునితో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సంతోషంగా గడిచిన తరువాత శుక్రాచార్యుడు శంఖచూడుడీతో ఇక నువ్వు లోకాన్ని జయించామని పంపుతాడు. శంఖచూడుడు భార్య అయినా బృంద చిన్నపటినుంచి శ్రీమహావిష్ణువు భక్తురాలు. ఆమె తన భర్త అయినా శంఖచూడుడీతో స్వామి మా తండ్రి గారి స్మామ్రాజ్యం మీ తండ్రి గారి స్మామ్రాజ్యం ఉన్నవి కదా మనం సంతోషంగానే ఉన్నముకదా లోకాన్ని జయించాలి అని ఆత్యాశను విడిచి పెట్టామని హితవు చెప్పింది.  రాక్షసుడైన శంఖచూడుడు వినలేదు.


         శంఖచూడుడు భూలోకాన్ని జయించాడు. మానవులను చిత్రహింసలు పెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా ఆడుకున్నాడు. ఆ విధంగా దేవతలను బలహీనులను చేసి దేవతలపై దండెత్తాడు. అతని వరప్రభావం వలనా అతనిని దేవతలు ఏమిచేయలేకపోయారు. దేవతలు అక్కడినుండి భూలోకానికి వచ్చి అడవులలో తలదాచుకున్నారు. ఇక శంఖచూడుడునికి ఎదురులేదుఅని అహంకారంతో అనేక పాపాలు చేశాడు. దేవతలు అతని భాధలు భరించలేక బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. అపుడు బ్రహ్మదేవుడు దేవతలారా అతని పాపాల వల్ల అతని తపఃశక్తి నశించింది. అతనిని చంపేవాడు ఒక మహాదేవుడే అని చేపి దేవతలను తీసుకొని బ్రహ్మ దేవుడు కైలాసానికి వెళ్లరు. మహాదేవుడు వీరి మొరలను ఆలకించి శంకచుడీడీపై యుద్ధనికి వేలాడు. మహాదేవుడు ఎంతగోరమైన యుద్ధం చేసిన శంఖచూడుడు మరణించటం లేదు. అపుడు శంకరుడు శ్రీమహావిష్ణువుని సహాయం కోరాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుని వరం గురించి చేపి శంకచూడుడి భార్య అయినా బృందకు పాతివ్రత్య భంగం కలగనంతవరకు శంఖచూడుడి మరణం సంభవించదు. నేను లోకం క్షేమం కోసం నేను బృంద పాతివ్రత్య భంగం కలిగిస్తాను అని శ్రీమహావిష్ణువు శంఖచూడుడి రూపం ధరించి బృంద దగరకు వేలారు. బృంద వచ్చింది నిజంగా తన భర్తే అనుకోని సంతోషించి అతనికి పాదాలు కడిగి భర్త అనే అనురాగంతో దగరకు వేలింది. ఆమె అలా వెళ్ళగానే ఆమె పాతివ్రత్యం భంగం అయింది. అదితెలుసుకున్నా బృంద రోదిస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే పరమాత్మగా పూజిస్తునాను కానీ నువ్వే నా పాతివ్రత్యాన్ని భంగం కలిగిస్తావా అని ఏడుస్తుంది. ఆ దుఃఖంలో విచక్షణ జ్ఞానం మరచి పోయి శ్రీమహావిష్ణువును నీవు శిలవు కమ్మని శపిస్తుంది. అందుకు శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి లోక క్షామం కోసం నేను ఈ పని చేశాను. నీవు తాకిన ఈ దేహాన్ని ఇక్కడే వదిలేస్తాను. అది సాలగ్రామాలు గా మరి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. బృంద నేటితో నీవు భూలోకానికి వచ్చిన కారణం, రాధాదేవి నీకు ఇచ్చిన శాపం, నీవు నన్ను కోరిన వరం నెరవేరాయి అని శ్రీమహావిషుణువు ఎల్లా చెప్పసాగాడు...................... 

                                         ................. ఇంకావుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...