భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 16

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున |

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||

అర్థం :-

ఆర్తులు, ఐహికవిషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్త్వజ్ఞానమును పొందుటకు ఇచ్ఛగలవారు, పరమాత్మప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు.



భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 15

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |

మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ||

అర్థం :-

మాయలో చిక్కుపడుటవలన విపరీతజ్ఞానమునకు లోనైనవారును, ఆసుర ప్రవృత్తిగలవారును, నరాధములును, మూడులును, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు.



భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 14

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |

మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ||

అర్థం :-

నా మాయత్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది.కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, సంసారసముద్రము నుండి బయటపడగలరు.



భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 13

త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ ||

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ||

అర్థం :-

నేను త్రిగుణాతీతుడను. ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్త్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక, త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను ఐన నన్ను ఆప్రాణులు తెలిసికొనలేకున్నవి.



        

భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 12

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |

మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి ||

అర్థం :-

సాత్త్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని, యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగాని లేవు.



        

భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 11

బలం బలవతాం చాహంకామరాగవివర్ణితమ్ |

ధర్మనిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ||

అర్థం :-

ఓ భరతశ్రేష్ఠా! బలవంతులలో కామరాగరహితమైన బలమును నేనే, భూతములన్నింటియందును ధర్మమునకు విరుద్ధముగాని కామమును నేనే.



భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 10

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |

బుద్ధిర్భుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||

అర్ధం :-

ఓ పార్ధా! సమస్త భూతములకును నన్నుసనాతనమైన బీజముగాఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...