భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 28

యుంజన్నేవం  సదాత్మనం యోగివిగతకల్మషః|

సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే ||

అర్ధం :-

పాపరహితుడైన ఆ యోగిపూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తిరూపమైన ఆపరిమితానందమును హాయిగా అనుభవించును. 



భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 27

ప్రసాంతమనసం హ్యేనం యోగినంసుఖముత్తమమ్ |

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్||

అర్ధం :-

ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రపమ్చిక కార్యములయమ్దు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకిభవమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. 



        

భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 26

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్|

తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశమ్ నయేత్||

అర్ధం :-

సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విసృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయములనుండి పదే పదే మరల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. 



భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 25

శనైః శనైరుపరమేత్ బుద్ద్యా ధృతిగృహీతయా|
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ||

అర్ధం :-

క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్దిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి, పరమాత్మనుతప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రము చింతనచేయరాదు. 


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 24

సంకల్పప్రభవాన్ కామన్ త్యక్త్యాసర్వానశేషతః |

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సనంతతః||

అర్ధం :-

సంకల్పములవలనకలిగిన కోరికలనన్నిటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్నివిధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను



ఆచమనం

పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలా సార్లు వింటాం. 


"ఆచమనం" అనే ఆచారం పవిత్రమైనది.


ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.


ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.


ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.


1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి? 

మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది.  అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం.

 స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.  స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.  ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. 

 ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. 

వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. 

ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.

శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది. 

రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. 

చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.

ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈమంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.  పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. 

చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, ప్రేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.

ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.

ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.



భగవద్గీత














అధ్యాయం 6

శ్లోకం 23

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞిత|
స నిశ్చయేన యోక్తవ్యో యొకయ నిర్విణ్ణచేతసా||

అర్ధం :-

దుఃఖరూపసంసారబంధముల  నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కారరూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును ధృడమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. 
        

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...