భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం37

అధ్యాయం 1
శ్లోకం 37
తస్మాన్నార్హా వయం హంతుం ధర్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖింనః స్వామ మధవ ||
 
      
అర్ధం:-
ఓ మాధవ! మన బంధువులైన ఈ ధార్తరాష్టులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును?







భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం36

అధ్యాయం 1
శ్లోకం 36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ||   

అర్ధం:-
ఓ జనార్ధన! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి ? (మనము మూట కట్టుకొనునది యేమి?)
ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును.  





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం35

అధ్యాయం 1
శ్లోకం 35
ఏతన్న హంతుమిచ్ఛామి ఘ్నతో పిమదుసూధన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహికృతే ||    

అర్ధం:-
ఓ మధుసూధనా ! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వీరిని చంపనే చంపను.  





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం34

అధ్యాయం 1
శ్లోకం 34
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||


అర్ధం:-
గురువులు, తండ్రులు, తాతలు కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు,
బావమరుదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి  చేరియున్నారు.  

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం33

అధ్యాయం 1
శ్లోకం 33
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ |
త ఇమే వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||



అర్ధం :-
మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదులుకొని యుద్ధములకు వచ్చియున్నారు. 





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం32

అధ్యాయం 1
శ్లోకం 32
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||


అర్ధం:-
ఓ కృష్ణ ! నాకు విజయము గాని, రాజ్యం గాని, సుఖములు గాని అక్కరలేదు. 
గోవిందా! ఈ రాజ్యమువలన గాని ఈ భోగమువలనగాని ఈ జీవితమువలన గాని ప్రయోజనం ఏమి? 





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం31

అధ్యాయం 1
శ్లోకం 31
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజననుమహానే ||

అర్ధం :-
ఓ కేశవ ! పెక్కు ఆపశకునములు కనబడుతున్నవి. 
యుద్ధమున స్వజనమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు.








రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...