అధ్యాయం 2
శ్లోకం 25
అవ్యక్తో యమచింత్యో యమ్ అవికార్యో యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
అర్ధం :-
ఈ అత్మ అవ్యక్తమైనది. అచింత్యము వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము.
అధ్యాయం 2
శ్లోకం 25
అవ్యక్తో యమచింత్యో యమ్ అవికార్యో యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
అర్ధం :-
ఈ అత్మ అవ్యక్తమైనది. అచింత్యము వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము.
అధ్యాయం 2
శ్లోకం 24
అచ్చేద్యో యమదాహ్యో యమ్ అక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణుః అచలో యం సనాతనః |
అర్ధం :-
ఈ ఆత్మ చేదించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును, సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది స్థాణువు సనాతనము.
అధ్యాయం 2
శ్లోకం 23
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతిపావక |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||
అర్ధం :-
ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.
అధ్యాయం 2
శ్లోకం 22
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్లాతి నరో సరాణి |
తథా శరీరాణి విహయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ||
అర్ధం :-
మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు, జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును.
అధ్యాయం 2
శ్లోకం 21
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ |
అర్ధం :-
ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము,నిత్యము అనియు,జననమరణములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును?ఎవరిని ఎట్లు చంపును?
అధ్యాయం 2
శ్లోకం 20
న జాయతే మ్రియతే నాకదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ |
అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||
అర్ధం :-
ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భవ వికారములు లేనిది. ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము నశిస్తుంది. ఆత్మ నశించదు.
అధ్యాయం 2
శ్లోకం 19
య ఏనం వేత్తి హంతారం యశ్సైనం మన్యతే హతమ్
ఉభౌ తౌన విజానీతో నాయం హంతి నహన్యతే ||
అర్ధం :-
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే.ఏలననగా, వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడదు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...